ఐ ఫోన్ 7: నీటితో చెలగాటం

Written By:

టైటిల్ ఏందీ ఢిపరెంట్ గా ఉంది అని అనుకుంటున్నారా....అవును నిజం ఐ ఫోన్ 7 ఇప్పుడు నీటితో చెలగాటమాడేందుకు రెడీ అవుతోంది. నీటిలో ఈదేందుకు సిద్ధమంటోంది. ఇందుకోసం యాపిల్ కంపెనీ పెద్ద కసరత్తే చేస్తోంది. ఫోన్ లో ఉన్న నీటిని స్పీకర్ల ద్వారా బయటకి పంపేందుకు అధునాతన టెక్నాలజీని కనిపెడుతోంది. దీనిపై పేటెంట్ ను సంపాదించేందుకు దరఖాస్తు కూడా చేసుకుంది. మరి దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: గూగుల్ కారుకు ఫైన్ తంటాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కష్టమర్ల ముందుకు సరికొత్త ఐ ఫోన్ 7

కష్టమర్ల ముందుకు సరికొత్త ఐ ఫోన్ 7

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లదే కాలం. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోనే. ఒక్క మాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ ఒక నిత్యవసరంలా తయారైంది. ఈ క్రమంలో ఫోన్ తయారీ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్స్ తో వస్తున్నాయి. ఫోన్ల తయారీ కంపెనీల్లో దిగ్గజం అయిన ఆపిల్ కంపెనీ..కష్టమర్ల ముందుకు సరికొత్త ఐ ఫోన్ 7 తేనుంది.

నీళ్లలో పడ్డా ఆ ఫోన్ చెక్కుచెదరదట

నీళ్లలో పడ్డా ఆ ఫోన్ చెక్కుచెదరదట

ఐఫోన్ 7 పేరిట తేనున్న ఆ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే..నీళ్లలో పడ్డా ఆ ఫోన్ చెక్కుచెదరదట. అంతేకాదు..నీళ్లు దూరినా..ఆ ఫోన్ ఆటోమేటిక్ గా నీళ్లను బయటకు పంపేస్తుందట. మార్కెట్‌లో ఇప్పటికే వాటర్‌ ప్రూఫ్ స్మార్ట్‌ ఫోన్లు బోలెడన్ని ఉన్నాయి.

వాటర్‌ ప్రూఫ్ ఫోన్ల లోపలి భాగాలపై సిలికాన్ పొర

వాటర్‌ ప్రూఫ్ ఫోన్ల లోపలి భాగాలపై సిలికాన్ పొర

అయితే వాటికి, ఆపిల్ కంపెనీ తీసుకురాబోయే ఐ ఫోన్ 7కి తేడా ఏంటంటే..వాటర్‌ ప్రూఫ్ ఫోన్ల లోపలి భాగాలపై సిలికాన్ పొర ఏర్పాటు చేసి ఉంటే...ఆపిల్ తయారు చేయబోయే ఫోన్ పూర్తి హైటెక్ అట.

ఫోన్ లో చేరిన నీటిని బయటకు పంపేసేందుకు

ఫోన్ లో చేరిన నీటిని బయటకు పంపేసేందుకు

ఫోన్ లో చేరిన నీటిని బయటకు పంపేసేందుకు ప్రత్యేక టెక్నాలజీని వినియోగించినట్టు ఆపిల్ కంపెనీ తెలిసింది.

ముందుగా ఒత్తిడి, కాంతులతోపాటు తేమను

ముందుగా ఒత్తిడి, కాంతులతోపాటు తేమను

ముందుగా ఒత్తిడి, కాంతులతోపాటు తేమను గుర్తించే సెన్సర్ల ద్వారా ఫోన్‌ లోకి నీరు చేరిందా? లేదా? అన్నది గుర్తిస్తారు.

ఫోన్ లో చేరిన నీటిని బయటకు పంపేసేందుకు

ఫోన్ లో చేరిన నీటిని బయటకు పంపేసేందుకు

ఫోన్ లో చేరిన నీటిని బయటకు పంపేసేందుకు ప్రత్యేక టెక్నాలజీని వినియోగించినట్టు ఆపిల్ కంపెనీ తెలిసింది.

నీరు ఉంటే వెంటనే బ్యాటరీ నుంచి చిన్న ఎలక్ట్రిక్ కరెంట్

నీరు ఉంటే వెంటనే బ్యాటరీ నుంచి చిన్న ఎలక్ట్రిక్ కరెంట్

నీరు ఉంటే వెంటనే బ్యాటరీ నుంచి చిన్న ఎలక్ట్రిక్ కరెంట్ ప్రసారమవుతుంది. నీరు మొత్తం స్పీకర్లు, మైక్రోఫోన్ పోర్టుల ద్వారా బయటకు వెళ్లిపోయేలా చేస్తారు.

స్మార్ట్‌ ఫోన్ స్పీకర్లపై నెగటివ్ ఛార్జ్ ఉన్న వలలాంటి నిర్మాణాన్ని

స్మార్ట్‌ ఫోన్ స్పీకర్లపై నెగటివ్ ఛార్జ్ ఉన్న వలలాంటి నిర్మాణాన్ని

స్మార్ట్‌ ఫోన్ స్పీకర్లపై నెగటివ్ ఛార్జ్ ఉన్న వలలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కూడా వాటర్‌ ప్రూఫ్ ఫోన్లు తయారు చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు ఆపిల్ తెలిపింది.

ఒకవేళ అప్పటికే ఫోన్‌ లోకి నీరు చేరి ఉంటే

ఒకవేళ అప్పటికే ఫోన్‌ లోకి నీరు చేరి ఉంటే

ఒకవేళ అప్పటికే ఫోన్‌ లోకి నీరు చేరి ఉంటే.. స్పీకర్లపైన ఉండే వల ఛార్జ్‌ ను పాజిటివ్ చేస్తే చాలని, నీరు దానంతట అదే బయటకు వెళ్లిపోతుందని వివరించింది.

పేటెంట్ సంపాదించేందుకు ఆపిల్ ఇటీవలే దరఖాస్తు

పేటెంట్ సంపాదించేందుకు ఆపిల్ ఇటీవలే దరఖాస్తు

ఈ సరికొత్త టెక్నాలజీకి పేటెంట్ సంపాదించేందుకు ఆపిల్ ఇటీవలే దరఖాస్తు చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write iPhone 7 could be waterproof: Apple patent describes speakers that repel water
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting