హల్‌చల్ చేస్తున్న ఐఫోన్ 8 ఫీచర్లు : వింటే షాకే !

Written By:

ఆపిల్ కంపెనీకి ఉన్న బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫోన్ చేతిలో ఉంటే అదొక రకమైన ఉత్సాహం, గర్వం చాలామందికి వస్తూ ఉంటుంది. ఈ మధ్యే కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 7 అమ్మకాలు కూడా ఓ రేంజ్ లో జరిగాయని కూడా తెలుస్తోంది. అయితే అది అలా వచ్చిందో లేదో అప్పుడే ఐఫోన్ 8 సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కళ్లు చెదిరే ఫీచర్లతో అది దూసుకొస్తోందని రూమర్లు వినిపిస్తున్నాయి.

టిమ్ కుక్‌‌కి సుందర్ పిచాయ్ సవాల్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవం

వచ్చే ఏడాది ఆపిల్ కంపెనీ ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలో దాన్ని సరికొత్తగా జరిపేలా , ఓ స్పెషల్ ఉండేలా ఆపిల్ కంపెనీ ప్లాన్ చేస్తుందని చాలామంది పేర్కొంటున్నారు.

స్పెషల్ ఏంటంటే ఐఫోన్ 8

అయితే ఈ స్పెషల్ ఏంటంటే ఐఫోన్ 8 అని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త డిజైన్‌లో ఐఫోన్8 లాంచ్ చేస్తుందని, వాటిలో పొందుపరిచే ఫీచర్లు చాలామటుకు కొత్తగా ఉండబోతున్నాయని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

పిజికల్ హోమ్ బటన్ తీసివేసి వర్చ్యువల్ బటన్‌

తాజా రూమర్ ప్రకారం రానున్న ఐఫోన్లో పిజికల్ హోమ్ బటన్ తీసివేసి వర్చ్యువల్ బటన్‌ను ఆపిల్ తీసుకునరానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 8లో పూర్తిగా హోమ్ బటన్ తీసివేయాలని ఆపిల్ ప్లాన్ చేస్తుందట.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఫోన్7లో

ఐఫోన్7లో ఫిజికల్ హోమ్ బటన్ పనిచేయని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఓ వర్చ్యువల్ బటన్‌ను ఆపిల్ పొందుపరిచింది.

5 అంగుళాల స్క్రీన్ తో

దీంతో పాటు ఇప్పటిదాకా ఉన్న స్క్రీన్లకు రాంరాం చెప్పి 5 అంగుళాల స్క్రీన్ తో ఐఫోన్ 8 రానున్నట్లు సమాచారం. ఈ మధ్య రిలీజ్ చేసిన ఐఫోన్7 స్క్రీన్ 4.7 అంగుళాలు కాగ, పెద్ద వెర్షన్ ఐఫోన్7 ప్లస్ స్క్రీన్ 5.5 అంగుళాలు.

ఐఫోన్ 8 మూడు స్క్రీన్ సైజుల్లో

కొత్త రూమర్ల ప్రకారం ఐఫోన్ 8 మూడు స్క్రీన్ సైజుల్లో మార్కెట్లోకి అడుగు పెడుతుందట. అవి 4.7 అంగుళాలు, 5 అంగుళాలు, 5.5 అంగుళాలుగా ఉండబోతున్నాయని సమాచారం.

రూమర్లను ఖండిస్తున్న ఇన్‌సైడర్లు

అయితే ఆపిల్ న్యూస్‌లను ఎప్పడికప్పుడూ అప్‌డేట్‌గా పేర్కొనే ఇన్‌సైడర్లు మాత్రం ఈ రూమర్లను ఖండిస్తున్నారు. ఎప్పుడూరెండు సైజుల ఫోన్లనే విడుదలచేసే ట్రెండ్‌ను ఆపిల్ అలానే ఫాలోఅవుతుందని పేర్కొంటున్నారు.

ఐఫోన్8 ఓలెడ్ డిస్‌ప్లే

గత రిపోర్టుల ముందస్తు సూచనల ప్రకారం ఐఫోన్8 ఓలెడ్ డిస్‌ప్లేను కలిగి, అల్యూమినియంకు బదులు మొత్తం గ్లాస్‌తో డిజైన్ చేస్తున్నారని తెలిసింది.

ఐఫోన్7 రిలీజ్ కు ముందే

ఐఫోన్7 రిలీజ్ కు ముందే ఈ విషయాన్ని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది తీసుకొచ్చే ఐఫోనే, అల్యూమినియం బాడీతో రూపొందే చివరి ఫోన్ అని పేర్కొన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 8 may come with 5-inch screen, all-glass design Read more At gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot