టిమ్ కుక్‌‌కి సుందర్ పిచాయ్ సవాల్ !

Written By:

ఇండియాలో ఇప్పటివరకు ఫోన్ల రారాజు ఎవరంటే టక్కున చెప్పే సమాధానం శాంసంగ్. అయితే గెలాక్సి నోట్ 7 పేళ్లుళ్లతో కంపెనీ ప్రతిష్ట ఒక్కసారిగా దిగజారింది. దీంతో ఆపిల్ తన అమ్మకాలను ఇండియాలో అనూహ్యంగా పెంచుకుంది. భారత మార్కెట్లో తనకు తిరుగులేదని నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఈ ప్రయత్నానికి గూగుల్ గండికొడుతోంది.

చరిత్ర సృష్టించిన జియో, యూజర్లకు తప్పని తిప్పలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నంబర్ వన్..?

భారత మార్కెట్లో నంబర్ వన్ స్థానానికి వచ్చేందుకు ఆపిల్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. సొంత ఆండ్రాయిడ్ డివైజ్‌లతో మార్కెట్లను శాసించాలని గూగుల్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది.

టిమ్ కుక్ ప్రయత్నాలకు

చైనా తర్వాత భారత్ మార్కెట్ పై ప్రధానంగా దృష్టి సారించిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రయత్నాలకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గట్టిపోటీని ఇస్తున్నట్లుగా ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి.

ఐఫోన్ vs ఫిక్సల్

ఆపిల్ ఇటీవలే తన కొత్త ఐఫోన్లను భారత్ లో లాంచ్ చేయగా...గూగుల్ తన సొంత బ్రాండులోని కొత్త ఫిక్సెల్ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్ లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి గూగుల్ లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా .. ముందస్తుగానే ఆండ్రాయిడ్ మార్కెట్ అంతటినీ తన సొంతం చేసుకుని ముందుకు దూసుకుపోతోంది. కుప్ల్తంగా చెప్పాలంటే భారత్‌లో 94 శాతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఆండ్రాయిడ్ ఓఎస్ డివైజ్‌లే ఏలుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

గూగుల్ సీఈవో

ఓ వైపు అత్యాధునికమైన డివైజ్‌లుగా పేరును సొంతం చేసుకున్నఆపిల్‌కు పోటీగా హై ఎండ్ డివైజ్‌లను తాము తీసుకొచ్చామంటూ గూగుల్ సీఈవో ప్రకటించిన సంగతి తెలిసిందే.

గూగుల్ కంపెనీ నుంచి తమకు గట్టి పోటీ వాతావరణం

ఇప్పటికే గూగుల్ కంపెనీ నుంచి తమకు గట్టి పోటీ వాతావరణం నెలకొందని, కానీ ఆండ్రాయిడ్ డివైజ్‌ల ఆధిపత్యాన్ని తాము ఎలాగైనా కొల్లగొడతామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ గట్టిగా నొక్కి చెప్పారు.

జియో ఇంటర్నెట్ స్పీడ్ సహకారంతో

రిలయన్స్ జియో ఇంటర్నెట్ స్పీడ్ సహకారంతో గూగుల్, శాంసంగ్‌లను తాము అధిగమిస్తామని, ఒక్కసారి ఆండ్రాయిడ్ కస్టమర్లు ఐఫోన్ల వైపు చూస్తే, వారు ఇతర ఓఎస్‌లను కనెత్తి కూడా చూడరని విశ్లేషకులంటున్నారు.

గూగుల్ తన ఆండ్రాయిడ్ కస్టమర్లను వదులుకుంటే

దీంతో పాటు గూగుల్ తన ఆండ్రాయిడ్ కస్టమర్లను వదులుకుంటే, మళ్లీ వారిని తనవైపు మరలుచుకోవడం కొంత కష్టతరమేనంటున్నారు విశ్లేషకులు.

ఆపిల్‌కూ ఓ పెద్ద సవాలే

ఇదిలా ఉంటే ఎప్పటినుంచో పాతుకుపోయిన ఆండ్రాయిడ్ డివైజ్‌లను మార్కెట్ నుంచి తొలగించి ఓఎస్ మార్కెట్ ని స్థాపించడం ఆపిల్‌కూ ఓ పెద్ద సవాలేనని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

రెండు కంపెనీల ఫోన్లు

కొత్తగా వచ్చిన రెండు కంపెనీల ఫోన్లు ధర పరంగా కూడా గట్టి పోటీ ఇచ్చుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో భారత్ మార్కెట్ ఇటు ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌కు, అటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Tim Cook has to face Sundar Pichai's googly to win India Read more at gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot