ఐఫోన్ 8 ధర లీకయింది, చాలా కాస్ట్ గురూ..

Written By:

ఈ ఏడాది ఆపిల్ 10 వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ కొత్త మోడల్ ఐఫోన్ 8ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రిపోర్టుల ప్రకారం ఈ మోడల్ ను కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గతేడాది తీసుకువచ్చిన ఐఫోన్ 7, 7 ప్లస్‌లు ఎల్ఈడి backlit widescreen Multi-Touch displayతో వస్తే ఐఫోన్ 8ను మాత్రం ఓలెడ్ డిస్‌ప్లే కర్వ్ టైప్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపోన్ 8 1000 డాలర్లతో మార్కెట్లోకి రానున్నట్లు టెక్ ఎనాలసిస్ట్ మింగ్ చి కూ తెలిపారు. కాగా ఐఫోన్ 7 650 డాలర్లు మాత్రమే. ధరకు తగ్గట్లుగా ఫీచర్లు కూడా దుమ్మురేపనున్నట్లు సమాచారం.

చైనా గడ్డపై జెండా పాతిన ఆపిల్, షియోమి అవుట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వర్చువల్‌ బటన్‌

ఐఫోన్‌ 7లో హెడ్‌ఫోన్‌ జాక్‌ను తొలగించిన కంపెనీ ఐఫోన్‌ 8లో హోమ్‌ బటన్ కు బదులు స్క్రీన్‌పై వర్చువల్‌ బటన్‌ను తీసుకురానుంది. వర్చువల్‌ బటన్‌ కోసం ఆపిల్‌ పేటెంట్‌ హక్కులను ఇదివరకే పొందిన సంగతి తెలిసిందే.

30 నిమిషాల వరకు

ఐఫోన్ 8 వాటర్ ప్రూఫ్ ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది ఆపిల్ ఐఫోన్ 8 సీరీస్ కు.. IP68 సర్టిఫికెట్ లభించబోతున్నట్టు సమాచారం. IP68 రేటింగ్ లభించిందంటే..ఆ స్మార్ట్ ఫోన్ 1.5 మీటర్ల లోతు ఉన్న నీటిలో పడిపోయినా 30 నిమిషాల వరకు ఆ ఫోన్ కు ఏమీ కాదు.

ఓలెడ్ డిస్‌ప్లేలు

ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లలో సాధారణ ఎల్‌సీడీ డిస్‌ప్లేలను మాత్రమే ఆపిల్ అందించింది. రానున్న ఐఫోన్ 8 మోడల్స్‌లో ఓలెడ్ డిస్‌ప్లేలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. దీంతోపాటు డిస్‌ప్లేలను కర్వ్ టైప్‌లో అందించనున్నట్టు సమాచారం.

ఇతర ఫోన్లకు సవాల్

రిజల్యూషన్ అయితే రానున్న ఐఫోన్ 8 రిజల్యూషన్ లో ఇతర ఫోన్లకు సవాల్ విసరనున్నట్లు తెలుస్తోంది. అత్యంత ఎక్కువ రిజల్యూషన్ తో పాటు అత్యంత పవర్ పుల్ Apple A11 processor తో ఫోన్ రానున్నట్లు సమాచారం.

మూడు రకాల వేరియంట్లలో

రిపోర్టుల ప్రకారం మూడు రకాల వేరియంట్లలో ఐఫోన్ 8 రానుందని సమాచారం. రెగ్యులర్ గా వచ్చే 4.7 సైజ్, అలాగే 5.5 సైజ్ తో పాటు తొలిసారిగా 5.8 ఇంచ్ ఓలెడ్ డిస్ ప్లే ను తీసుకురానుందని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఉన్న టీఎప్ టీ ఎల్ సీడి ప్యానల్స్ ను మారుస్తూ ఓలెడ్ డిస్ ప్లేతో దీనిని తీసుకురానున్నట్లు సమాచారం.

nanometer A11 chip

దీంతో పాటు వైర్ లెస్ ఛార్జింగ్ తో ఐఫోన్ 8 రానుంది. దీని ద్వారా ఛార్జింగ్ చాలా వేగవంతంగా అవుతుందని కంపెనీ చెబుతోంది. ప్రీక్వీన్సీ లో ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ వైర్ లెస్ ఛార్జింగ్ పనిచేయనుంది. రానున్న ఈ ఫోన్ 10-nanometer A11 chipతో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐరిస్ ఫేసియల్ స్కానింగ్ ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికొస్తే 3000Mah బ్యాటరీ.

కెమెరా

కెమెరా విషాయానికొస్తే 16 మెగా ఫిక్సల్ కెమెరా విత్ డ్యూయల్ లెడ్ ప్లాష్ లైట్ తో పాటు 4 కె వీడియో రికార్డింగ్ తో రానుంది. సెల్పీ అభిమానుల కోసం 8 మెగా ఫిక్సల్ సెల్ఫీని పొందుపరిచినట్లుగా తెలుస్తోంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 4 జిబి ర్యామ్ తో ఐఫోన్ 8 రానున్నట్లు తెలుస్తోంది. 32, 64, 128 జిబి ఇంటర్నల్ మెమొరీతో పాటు మైక్రో ఎస్ డీ ద్వారా విస్తరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 8 might be priced over 1,000 dollers oled display read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot