శాంసంగ్‌తో ఆపిల్ ఢీ, గెలాక్సీ ఎస్8కి సవాల్ !

Written By:

స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్ మరోమారు నువ్వా నేనా అంటూ ధరలతో తలపడబోతున్నాయి. శాంసంగ్ తన ప్రతిష్టాత్మక ఫోన్లు గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ లను గత వారమే యుఎస్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండేలా 840 డాలర్ల నుంచి 850 డాలర్ల మధ్యలో వీటిని వదిలింది. అంటే మన దేశ కరెన్సీ ప్రకారం రూ.54,045 నుంచి రూ.54,707 వరకు నిర్ణయించింది. అయితే ఆపిల్ కూడా ఈ ధరల్లోనే తన కొత్త ఫోన్ తీసుకురావాలనుకుంటోంది.

అదిరే 4జీ వోల్ట్ ఫోన్ రూ. 4 వేలకే !14జిబి డేటా ఫ్రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ తన కొత్త గెలాక్సీలను

ప్రస్తుతం శాంసంగ్ తన కొత్త గెలాక్సీలను రంగంలోకి దింపగా.. ఆపిల్ సైతం తన కొత్త ఐఫోన్ ను త్వరలోనే తీసుకురాబోతున్నట్టు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ ధర కూడా శాంసంగ్ కొత్త గెలాక్సీలకు సమానంగా ఉండేలా నిర్ణయిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఓలెడ్ డిస్ ప్లేతో

ఓలెడ్ డిస్ ప్లేతో లాంచ్ కాబోతున్న హై-ఎండ్ ఐఫోన్ 8, 64జీబీ మోడల్ ప్రారంభ ధర 850 డాలర్ల నుంచి 900 డాలర్ల మధ్యలో ఉంటుందని మ్యాక్‌రూమర్స్.కామ్ తెలిపింది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 54,707 రూపాయల నుంచి 57,925 రూపాయలు.

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ప్రారంభ ధరలు

అదేవిధంగా ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ప్రారంభ ధరలు కూడా 649 డాలర్లు, 749 డాలర్ల వరకు నిర్ణయించనుందని పేర్కొంది.

ట్రూ కలర్ ఐప్యాడ్ ప్రొ

వైర్ లెస్ ఛార్జింగ్, నో ఫిజికల్ హోమ్ బటన్, 3డీ ఫేసియల్ రికగ్నైజేషన్, లేదా ఐరిస్ స్కానింగ్ ఈ కొత్త ఐఫోన్8లో ప్రత్యేకతలు. ''ట్రూ కలర్ ఐప్యాడ్ ప్రొ'' స్క్రీన్ టెక్నాలజీని కూడా మొదటిసారి వాడబోతుందని తెలుస్తోంది.

గెలాక్సీ నోట్7 పేలుళ్ల ఘటనతో

అంతకముందు కూడా శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గెలాక్సీ నోట్ 7 తీసుకొచ్చిన తర్వాతనే, ఐఫోన్ తన కొత్త ఐఫోన్ 7ను రంగంలోకి దించింది. గెలాక్సీ నోట్7 పేలుళ్ల ఘటనతో తీవ్ర ఇరకాటంలో కూరుకుపోవడం, ఐఫోన్ 7కు భారీ ఎత్తున కలిసివచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 8 predicted to start at $850 to $900 in US read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot