256జిబి స్టోరేజితో ఐ ఫోన్ 7, 7ప్లస్..రేపే విడుదల

Written By:

దిగ్గజ టెక్ కంపెనీ ఆపిల్ నుంచి మరో కొత్త ఫోన్ ఐఫోన్ 7 రాబోతోంది. అమెరికా వేదికగా రేపు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐ ఫోన్ 7, 7 ప్లస్ సీరిస్ ఫోన్లు విడుదల కానున్నాయి. ఆపిల్ ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. రానున్న ఐ ఫోన్ భారీ మార్పులతో రానుందని తెలుస్తోంది. బయటకు తెలియకుండా అంతర్గతంగా ఆపిల్ ఈ ఫోన్ల ఫీచర్లను ఒకేసారి విడుదల చేస్తున్నట్లు సమాచారం.

రిలయన్స్ జియో vs బీఎస్ఎన్ఎల్:పోల్చి చూస్తే జియోకి షాక్

256జిబి స్టోరేజితో ఐ ఫోన్ 7, 7ప్లస్..రేపే విడుదల

ఇప్పటిదాకా విడుదలైన ఐఫోన్లు 16 జీబీ మెమరీ నుంచి 128 జీబీ మెమరీ సామర్థ్యంతో వస్తే తాజా మోడల్ లో 16, 64 జీబీ మెమరీలకు స్వస్తి చెప్పేసిన ఆపిల్ ... కొత్తగా 256 జీబీ మెమరీ సామర్థ్యాన్ని యాడ్ చేసేసినట్లుగా తెలుస్తోంది. ఇక రంగుల విషయంలోనూ ఆపిల్ సరికొత్త కసరత్తు చేసింది. తాజా మోడల్ లో 'డార్క్ బ్లాక్', 'గ్లాస్సీ పియానో ​​బ్లాక్' రంగులను యాడ్ చేసింది.

ఉచితంపై షాకింగ్ ట్విస్టు ఇస్తూ జియో మొదలైంది

256జిబి స్టోరేజితో ఐ ఫోన్ 7, 7ప్లస్..రేపే విడుదల

ఇక తాజా మోడల్ ఫోన్లను ఆపిల్ వాటర్ ప్రూఫ్ గానూ రూపొందించింది. ఆపిల్ నుంచి రేపు అఫీషియల్ గా మార్కెట్లోకి రానున్న ఐఫోన్ 7, 7 ప్లస్ ఫోన్లు ... అమెరికాలో ఈ నెల 16 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక భారత మార్కెట్ లోకి ఈ ఫోన్ల ఎంట్రీకి సంబంధించి ఇంకా తేదీలు ఖరారు కాలేదు. ఆపిల్ ఐ ఫోన్ 7 ఫీచర్లు కింది విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని రూమర్లు వినిపిస్తున్నాయి.

అరగంట నీళ్లలో ఉంచినా చెక్కు చెదరని ఫోన్..ధర రూ. 7వేలే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

కొన్ని లీకుడ్ ఇమేజెస్ ప్రకారం ఐఫోన్ 7 డిజైన్ విషయంలో ఐఫోన్ 6ఎస్‌తో పోలిస్తే పెద్దగా మార్పు చేర్పులు లేవని తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో యాంటీనా బ్యాండ్స్ కనిపించవు. కెమెరా బంప్‌ను కాస్తంత తగ్గించారు.

#2

ఐఫోన్ 7లో సాంప్రదాయ 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ కనిపించకపోవచ్చు. ఈ హెడ్‌ఫోన్ జాక్ స్థానంలో రెండు విధాలుగా ఉపయోగపడే లైట్నింగ్ కేబుల్ పోర్ట్‌ను ఆపిల్ ఏర్పాటు చేయబోతోంది. ఈ లైట్నింగ్ కేబుల్ పోర్ట్ చార్జింగ్ అలానే హెడ్‌ఫోన్ యూసేజ్ అవసరాలను తీరుస్తుంది.

#3

రూమర్ మిల్స్ ప్రకారం అప్‌కమింగ్ ఐపోన్ 7 మోడల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం. ఈ ఫీచర్ గనుక కన్ఫర్మ్ అయితే ఐఫోన్ 7 కెమెరా క్వాలిటీ కొత్త స్టాండర్డ్స్‌ను నెలకొల్పే అవకాశం ఉంది.

#4

ఐఫోన్ ప్రో పేరుతో యాపిల్ లాంచ్ చేయబోతోన్న అప్‌కమింగ్ ఫోన్ స్మార్ట్ కనెక్టర్ ఫెసిలిటీతో వచ్చే అవకాశం. స్మార్ట్ కీబోర్డ్ వంటి ప్రత్యేకమైన యాక్సెసరీస్‌ను ఈ ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

#5

ఆపిల్ ఐఫోన్ 7 అప్‌గ్రేడెడ్ ఏ10 చిప్‌సెట్‌తో పాటు 2జీబి ర్యామ్‌తో వచ్చే అవకాశం. ఇదే సమయంలో ఐఫోన్ 7 ప్లస్ ఏ10 చిప్‌సెట్‌తో పాటు 3జీబి ర్యామ్‌తో వచ్చే అవకాశం.

#6

ఐఫోన్ 7 బ్యాటరీ కెపాసిటీ 7.04 watt-hoursగా ఉండే అవకాశం. ఐఫోన్ 7 ప్లస్ బ్యాటరీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావల్సి ఉంది.

 

 

#7

స్టోరేజ్ విషయానికి వచ్చే సరికి ఐఫోన్ 7 బేస్ మోడల్ 32జీబి వేరియంట్‌తో లభ్యమయ్యే అవకాశం. ఇంతకముందు ఐఫోన్ 6ఎస్ బేస్ మోడల్ 16జీబిగా ఉంది.

#8

సామర్ధ్యం విషయానికొస్తే ఇప్పటిదాకా విడుదలైన ఐఫోన్లు 16 జీబీ మెమరీ నుంచి 128 జీబీ మెమరీ సామర్థ్యంతో వస్తే తాజా మోడల్ లో 16, 64 జీబీ మెమరీలకు స్వస్తి చెప్పేసిన ఆపిల్ ... కొత్తగా 256 జీబీ మెమరీ సామర్థ్యాన్ని యాడ్ చేసేసినట్లుగా తెలుస్తోంది.

#9

తాజా మోడల్ లో 'డార్క్ బ్లాక్', 'గ్లాస్సీ పియానో ​​బ్లాక్' గ్రే, టైరాంట్ గోల్డ్, బ్లూ, రోజ్ గోల్డ్ , స్పేస్ బ్లాక్ రంగులతో రానున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో ఈ నెల 16 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక భారత మార్కెట్ లోకి ఈ ఫోన్ల ఎంట్రీకి సంబంధించి ఇంకా తేదీలు ఖరారు కాలేదు.

#10

ఆపిల్ తన ఐఫోన్ 7తో పాటు వైర్‌లెస్ ఇయర్‌పోడ్స్‌ను బండిల్డ్ ప్యాక్ క్రింద ఆఫర్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write iPhone 7 to have 2.4GHz processor and up to 256GB storage
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot