షాకిచ్చిన ఆపిల్ : ఐఫోన్ జీవిత కాలం మూడేళ్లే !

Written By:

ఆపిల్ కంపెనీ ఇప్పుడు వినియోగదారులకు సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఆపిల్ నుంచి వచ్చిన ఐ ఫోన్ల జీవితకాలం కేవలం మూడు సంవత్సరాలనని చెప్పింది. అయితే ఈ సంస్థ చేసే గడియారాలు, టీవీలు మాత్రం నాలుగేళ్లు పనిచేస్తాయట.ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యాపిల్ తన పర్యావరణ విధానాన్ని మార్చుకుంటోంది. అందులో 'యాపిల్' పరికరాల జీవిత కాలం గురించి చెప్పినట్టు ఫోర్బ్స్ డాట్‌కామ్ తెలిపింది. అయితే పాత పరికరాలకు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ చేయకుండా, రిపేర్లు చేసుకోవడానికి విడిభాగాలనూ ఇవ్వకూడదనే యాపిల్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా అపిల్ అభిమానులకు ఇది పెద్ద దెబ్బలాంటిదే. ఈ మధ్య ఆపిల్ అమ్మకాలు పడిపోవడంతో ఆపిల్ సరికొత్త వ్యూహాలకు తెరలేపింది.

Read more: ఐ ఫోన్ 7:కొత్త ఫీచర్స్‌‌ వద్దంటూ యుద్ధం మొదలైంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఆపిల్ అదిరిపోయే కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. నెలకి రూ. 999 చెల్లిస్తే ఐ ఫోన్ మీ చేతికిస్తారు. మీరు నెలంతా దాన్ని మీ ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చు. ఇలా దాదాపు రెండేళ్ల వరకు మీరు నెలకి రూ. 999 చెల్లించి ఐ ఫోన్ ని వాడుకోవచ్చు. ఫోన్లను అద్దెకిస్తామనే సరికొత్త ప్రతిపాదనతో ఆపిల్ ఇప్పుడు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది.

2

ఈ ఫోన్లే కాకుండా ఐ ఫోన్ 6ఎస్, ఐఫోన్6 రకాలను కూడా అద్దెకిచ్చేందుకు రెడీ అయింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ రకాలు అద్దెకు తీసుకోవాలంటే నెలకు రూ. 1,199, రూ. 1,399 అద్దెను చెల్లించాల్సి వుంటుందని తెలిపింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో యాపిల్ వ్యాపార ప్రకటనలు ఇచ్చింది.

3

ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఐఫోన్ ఎస్ఈ మోడల్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. గతవారం ఐఫోన్ ఎస్ఈ అమ్మకాలు మొత్తం ఐఫోన్ మోడల్ ఫోన్లలో 0.1 శాతం మాత్రమేనని లోకలిస్టిక్ సర్వేలు వెల్లడించాయి.

4

ఈ ఫోన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు బయటకు రావడంతో అమ్మకాలు పడిపోయాయని అదీ కూడా ఓ కారణం కావచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 7ఎస్ మోడల్ విడుదల చేసినా కూడా అది ఈ ఫోన్ అమ్మకాలను పెద్దగా కాపాడగలిగే పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి.

5

ఇంకా దీని ప్రభావం రానున్న ఐ ఫోన్ పై పడే అవకాశం ఉందని దాని అమ్మకాలు కూడా ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటనే భయం కూడా ఇప్పుడు మార్కెట్ వర్గాలను కలవరపెడుతోంది.

6

ఐ ఫోన్ ఎస్ఈ రాకతో ఆపిల్ ఫోన్లు రేట్లు గణనీయంగా తగ్గుతాయని భావించినా అదేమి జరగలేదు. పైగా ఈ ఫోన్ తయారీఖర్చు 10 వేలు కాని అమ్మేది మాత్రం 40 వేలు అంటూ ఈ మధ్య వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం కూడా అమ్మకాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

7

ఐ ఫోన్ 7 సెప్టెంబర్ లో మార్కెట్లోకి రానుంది. రానున్న కొత్త ఫోన్ లో కొన్ని ప్రత్యేకతలను జోడించి మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ధర ఎంతో చెప్పకపోయినా కాని రానున్న ఐ ఫోన్ భారీ స్థాయిలోనే ఉండొచ్చనే తెలుస్తోంది

8

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ క్లిక్ చేపి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write iPhones Have a Life Expectancy of Three Years, Says Apple
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot