Home
Mobile

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు లీక్‌.. ఏకంగా 6400mAh బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ ఐకూ మార్చి నెలలో ఐకూ నియో 10R (iQOO Neo 10R Smartphone) లాంచ్‌ కానుంది. భారత్‌ మార్కెట్‌ లో మార్చి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలోనే ఆ సంస్థ ఇండియా సీఈవో నిపుణ్‌ మార్యా వెల్లడించారు. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఫోన్‌ బ్యాక్‌ ప్యానల్‌ డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు భారత్‌లో ప్రత్యేకంగా Raging Blue కలర్‌ వేరియంట్‌ లో విడుదల కానుంది.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌ :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ తో లాంచ్ కానుందని ఇప్పటికే ఐకూ వెల్లడించింది. ఈ చిప్‌సెట్‌ LPDDR5X ర్యామ్‌, UFS 4.0 తో జతచేసి ఉండనుందని తెలిపింది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు లీక్‌ అయ్యాయి. టిప్‌స్టర్‌ యోగేష్‌ బ్రార్‌ X ద్వారా ఈ వివరాలు వెల్లడించారు.

iQOO Neo 10R Smartphone

ధర వివరాలు లీక్‌ :
ఈ వివరాల ఆధారంగా నియో 10R ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.35,999 గా ఉంటుందని తెలిపారు. బ్యాంకు ఆఫర్లతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ బేస్‌ వేరియంట్ రూ.30,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

144Hz రీఫ్రెష్‌ రేట్‌ :
ఐకూ కొత్త ఫోన్‌ డిస్‌ప్లే, కెమెరా వివరాలు ఇప్పటికే లీక్‌ అయ్యాయి. దీని ఆధారంగా ఈ ఫోన్‌ 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫలితంగా స్మూత్‌ ఫెర్మామెన్స్‌ ను అందిస్తుందని సమాచారం.

భారీ బ్యాటరీ :
దీంతోపాటు మార్చి నెలలో విడుదల కానున్న ఐకూ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఎక్కువ గంటలపాటు ఫోన్‌ వినియోగించే వారికి సౌకర్యంగా ఉండేలా ఏకంగా 6400mAh బ్యాటరీతో విడుదల కానుందని సమాచారం. దీంతోపాటు ఈ ఫోన్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో రానుంది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ స్క్వోవల్‌ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ ను కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్‌ కెమెరాలతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ తో లాంచ్‌ కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ ఐకూ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

* గత సంవత్సరం చివరలో ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌ లో ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.54,999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.59,999 గా ఉంది.

ఈ ఫోన్ 6.82 అంగుళాల 2K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మరియు క్వాల్‌కామ్‌ 3nm స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 50MP + 50MP + 50MP కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Neo 10R Smartphone price leaked ahead of launch on march 10 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X