Home
Mobile

iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వివరాలు వెల్లడి.. ఎప్పుడు విడుదల కానుందంటే?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐకూ నుంచి చివరిసారిగా ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఐకూ నుంచి వచ్చే నెలలో మరో హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ (iQOO Neo 10R Smartphone) మార్చి 11 వ తేదీన లాంచ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే సంస్థ ప్రకటన చేసింది. దీంతోపాటు అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు వివరాలు కూడా వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ కీలక వివరాలను ఐకూ ధ్రువీకరించింది. మరియు ఈ సెగ్మెంట్‌లోనే ఫాస్టెస్ట్‌ ఫోన్‌గా పేర్కొంది.

ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్‌ప్లేతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. తాజాగా సంస్థ వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ ఫోన్‌ 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 3840Hz PWM డిమ్మింగ్‌ రేట్‌, 2000Hz టచ్ శాంప్లింగ్‌ రేట్‌తో అందుబాటులో ఉంటుంది. అయితే కొన్ని లీక్స్‌ ఆధారంగా ఈ ఫోన్ 6.78 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

iQOO Neo 10r Smartphone launch date in india

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ LPDDR5X ర్యామ్‌, UFS 4.0 తో జతచేసి ఉండనుందని సమాచారం. 7.98mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ 1.7 మిలియన్ పాయింట్ల AnTUTU స్కోర్‌ను నమోదు చేసినట్లు తెలుస్తోంది.

దీంతోపాటు గేమింగ్‌కు ఈ హ్యాండ్‌సెట్ అత్యంత అనుకూలంగా ఉంటుందని ఐకూ తెలిపింది. గేమింగ్ అనుకూలంగా ఉండేలా ఈ హ్యాండ్‌సెట్‌ ప్రత్యేకంగా ఇ-స్పోర్ట్స్‌ మోడ్‌ను కలిగి ఉంటుందని ఐకూ వెల్లడించింది. దీంతోపాటు 6043mm2 వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంటుందని తెలిపింది.

iQOO Neo 10r Smartphone launch date in india

కెమెరా విభాగం పరంగాను మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ ప్రైమరీ కెమెరా. 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ తో లాంచ్‌ కానుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని ఐకూ తాజాగా వెల్లడించింది.

ఈ కెమెరా 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6400mAh బ్యాటరీ తో పనిచేస్తుందని తెలిపింది. భారీ బ్యాటరీ కారణంగా ఎక్కువ సమయంపాటు ఫోన్‌ వినియోగించే వారికి అనుకూలంగా ఉంటుంది.

iQOO Neo 10r Smartphone launch date in india

ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.30000 గా ఉండే అవకాశం ఉంది. మరియు గరిష్ఠంగా 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐకూ ఇ-స్టోర్‌ మరియు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ రేజింగ్‌ ‌బ్లూ, మూన్‌లైట్‌ టైటానియం రంగుల్లో లభిస్తుంది.

* ఐకూ నుంచి ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఫోన్ ఐకూ 13. గత సంవత్సరం ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల అయింది. ఫ్లా్గ్‌షిప్‌ రేంజ్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 6.82 అంగుళాల 2K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్‌ 3nm స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

ఈ ఫోన్ 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP + 50MP + 50MP కెమెరాలు సహా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.54,999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.59,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Neo 10r Smartphone key specifications and features revealed in india ahead of launch in march
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X