కొత్త ఫోన్ కొనుగోలు చేసే ఆలోచన ఉంటే కాస్త ఆగండి.. ఏకంగా 7300mAh బ్యాటరీతో 5G ఫోన్ వచ్చేస్తోంది..!
ఐకూ నుంచి ఇటీవల ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. సేల్ కూడా ప్రారంభం అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6400mAh భారీ బ్యాటరీ, మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్‌లు, వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంది. మిడ్ రేంజ్ ధరలో ఈ హ్యాండ్‌సెట్ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
తాజాగా మరో స్మార్ట్‌ఫోన్ గురించి కీలక వివరాలు (iQOO Z10 5G Smartphone) వెలుగులోకి వచ్చాయి. ఐకూ ఇండియా సీఈవో నిపున్ మార్యా ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ కానుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

ఈ టీజర్‌లో బ్యారీ, బ్యాక్ ప్యానల్ డిజైన్, కెమెరా మాడ్యూల్ డిజైన్ సహా ఇతర వివరాలు ఉన్నాయి. దీంతోపాటు ఈ ఫోన్ లాంచ్ తేదీని కూడా ఐకూ వెల్లడించింది. నియో 10R స్మార్ట్‌ఫోన్‌లో భారీ బ్యాటరీని అందించిన ఐకూ.. మరింత భారీ బ్యాటరీతో ఐకూ Z10 5G ఫోన్‌ను లాంచ్ చేస్తోంది.
ఎప్పుడు విడుదల కానుంది :
ఐకూ ఇండియా సీఈవో నిపున్ మార్యా అందించిన వివరాల ఆధారంగా ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ 7300mAh బ్యాటరీతో ఏప్రిల్ 11వ తేదీన లాంచ్ చేస్తామని తెలిపారు. ఫలితంగా ఈ ఫోన్ అనేక మందిని ఆకట్టుకొనే ఆవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ సమయం ఫోన్‌తో గడిపేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
డిజైన్ వివరాలు :
ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ టీజర్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ వెనుక వైపు వృత్తాకార కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది.
వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌తోపాటు LED ఫ్లాష్ లైట్‌ను గుర్తించవచ్చు. మరియు ఈ ఫోన్ మార్బుల్ టెక్చర్ డిజైన్‌తో వైట్ కలర్ వేరియంట్‌లో కనిపించింది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో ప్రాసెసర్, డిస్‌ప్లే సహా అంచనా ధర వివరాలున్నాయి.
ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు! :
గతంలో వచ్చిన లీక్స్ ఆధారంగా 6.67 అంగుళాల (2400*1080 పిక్సల్స్) క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 8GB లేదా 12GB ర్యామ్ మరియు 128GB లేదా 256GB స్టోరేజీతో జత చేసి ఉంటుందని తెలిసింది. అయితే ఈ ఫోన్ ఎన్ని వేరియంట్స్‌లో లభిస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉండే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాతోపాటు 2MP సెకండరీ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
భారత్ మార్కెట్‌లో ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.25000 ధర రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు టాప్ ఎండ్ స్టోరేజీ వేరియంట్ రూ.30000 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. IR బ్లాస్టర్ సహా భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చి ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications








