Home
Mobile

7300mAh భారీ బ్యాటరీ కలిగిన iQOO Z10 5G స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు లీక్‌.. పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐకూ నుంచి ఇటీవల ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ రూ.25,000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఐకూ నుంచి మరో హ్యాండ్‌సెట్ లాంచ్ కానుంది. 7300mAh బ్యాటరీ బ్యాటరీతో ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 11 వ తేదీన భారత్‌ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ గురించి ఇప్పటికే కొన్ని లీక్స్‌ వచ్చాయి.

ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ (iQOO Z10 Smartphone) డిజైన్ సహా ఇతర వివరాలు ఇటీవల లీక్‌ అయ్యాయి. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ ధర వివరాలు లీక్ అయ్యాయి. ఐకూ Z10 ఫోన్‌తోపాటు Z10x హ్యాండ్‌సెట్‌ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.

iQOO Z10 Smartphone price leaked

ధర వివరాలు లీక్‌ :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలను Smartprix ద్వారా విడుదల అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ 128GB స్టోరేజీ, 256GB స్టోరేజీ వేరియంట్స్‌ లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ వేరియంట్స్‌ ర్యామ్‌ 6GB లేదా 8GB గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ బేస్‌ వేరియంట్ ధర రూ.21999 గా ఉంటుందని తెలుస్తోంది. బ్యాంకు ఆఫర్లతో రూ.19999 కే కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వస్తుందని సమాచారం.

నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌ :
ఈ ఫోన్‌లో మెయిన్‌ హైలెట్‌ 7300mAh బ్యాటరీ, 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో కేవలం 33 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని తెలుస్తోంది. అయితే భారీ బ్యాటరీతో లాంచ్‌ అవుతున్నా.. ఈ ఫోన్ థిక్‌నెస్‌ కేవలం 7.89mm గానే ఉంటుందని ఐకూ వెల్లడించింది. ఈ ఫోన్‌ బరువు 195 గ్రాములుగా ఉంటుందని సమాచారం.

ఐకూ ఈ ఫోన్‌కు సంబంధించి డిజైన్‌, కలర్ వేరియంట్‌ వివరాలు ఇప్పటికే వెల్లడించింది. దీని ఆధారంగా గ్లేసియర్ సిల్వర్‌, స్టెల్లర్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ డిస్‌ప్లే ఏకంగా 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

చిప్‌సెట్‌ అంచనా వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుందని సమాచారం. మరియు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.4, వైఫై 6, IP64 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చి ఉంటుందని సమాచారం. మరియు డ్యూయల్‌ స్పీకర్‌లతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z10 Smartphone price leaked ahead of launch in april 11 2025 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X