రూ.10,499 ధరకే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ 5G స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం ఐకూ Z9x 5G స్మార్ట్‌ఫోన్ (iQOO Z9x 5G Smartphone) విడుదల అయింది. బడ్జెట్ రేంజ్‌లోనే ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. దీంతోపాటు 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. డిజైన్ పరంగాను ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు.
రూ.2500 తగ్గింపు :
ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999 ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.10499 కే కొనుగోలు చేయవచ్చు. సుమారు రూ.2500 డిస్కౌంట్ పొందవచ్చు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ14999 కి విడుదల అయింది. ప్రస్తుతం రూ.11999 కే కొనుగోలు చేయవచ్చు.

గతనెల కంటే :
8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 కి విడుదల అయింది. ప్రస్తుతం రూ.13499 గా ఉంది. అయితే ఈ వేరియంట్ స్టాక్ లేనట్లు తెలుస్తోంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో రూ.1000 తక్కువ ధరకు ఈ ఫోన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఐకూ Z9X 5G ఫోన్ 6.72 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2408*1080 పిక్సల్స్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. టోర్నడో గ్రీన్, స్ట్ర్రోమ్ గ్రీన్ కలర్ వేరియంట్స్ అందుబాటులో ఉంది.
కెమెరాల వివరాలు :
ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చిన నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాను అమర్చారు. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ, f/2.4 అపేచర్‌తో 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు f/2.0 అపేచర్‌తో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఐకూ 5G స్మార్ట్‌ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 తో జతచేసి ఉంది. మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.
భారీ బ్యాటరీ :
ఐకూ Z9x 5G స్మార్ట్‌ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ బరువు 199 గ్రాములుగా ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.1, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








