రూ.13,000 కంటే తక్కువ ధరలో కొత్తగా విడుదల అయిన 5G స్మార్ట్‌ఫోన్‌లు.. సూపర్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
భారత్ మార్కెట్‌లో ఇటీవల కారణంగా బడ్జెట్ రేంజ్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాబితాలో శాంసంగ్, వివో, పోకో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వివో హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీని కలిగి ఉండగా... పోకో ఫోన్ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ ఫోన్‌లు ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందుకోనున్నాయి. ఈ ఫోన్‌లు రూ.13000 కంటే తక్కువ ధరకు (latest Best 5G Smartphone)అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ :
గెలాక్సీ F16 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F16 5G) 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందనుంది.

ఈ ఫోన్ 50MP ప్రైమరీ, 5MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. ముందువైపు 13MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ M16 5G ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ M16 5G ఫోన్ (Samsung Galaxy M16 5G) 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. విజన్ బూస్టర్, ఐ కేర్ షీల్డ్ వంటి ఫీచర్‌లున్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఈ ఫోన్‌లను మింట్ గ్రీన్, థండర్ బ్లాక్, బ్లష్ పింక్ కలర్ వేరియంట్స్ లభిస్తుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 OS ను కలిగి ఉంది. 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
గెలాక్సీ M16 5G హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్‌లను కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499 గా ఉంది.
పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ :
పోకో M7 5G హ్యాండ్‌సెట్ (Poco M7 5G) 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ 50MP సోనీ IMX852 ప్రైమరీ, మరో కెమెరాను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. వెనుక వైపు ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. 18W వైర్ ఛార్జింగ్‌తో 5160mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10,999 గా ఉంది.
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ :
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ (Vivo T4X 5G) 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 4D గేమ్ వైబ్రేషన్ ఫీచర్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందనుంది.
ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ కెమెరాలను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు డైనమిక్ లైట్ రింగ్‌ను ఏర్పాటు చేశారు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ +128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది.


Click it and Unblock the Notifications







