లావా కొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఐరిస్ 501’

Posted By: Super

 లావా కొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఐరిస్ 501’

 

ప్రముఖ మొబైల్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ ‘లావా ఐరిస్ 501’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ప్లాట్‌ఫామ్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. 5 అంగుళాల పెద్దదైన స్ర్కీన్ ఉత్తమ డిస్‌ప్లే అనుభూతులను చేరువచేస్తుంది. ఫోన్ ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లు:

తెలుగు హిరోల సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)!

-  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

-  ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆఫరేటింగ్ సిస్టం,

-  చుట్టుకొలత  148.5x79x10.5మిల్లీ మీటర్లు,

-  2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

-  జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,

-  5 మెగా పిక్సల్ ఆటో-ఫోకస్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

-  యూఎస్బీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,

-  32జీబి టీ-ఫ్లాష్ సపోర్ట్,

-  ఎఫ్ఎమ్ రేడియో,

-  యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ సెన్సార్. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై అదనపు హార్డ్‌బ్యాక్ కవర్ ఇంకా 4జీబి మెమరీ కార్డ్‌ను ఉచితంగా పొందవచ్చు. ఫోన్ ధర వివరాలు తెలియాల్సి ఉంది.

లావా కొత్త ట్యాబ్లెట్స్ ‘ఈట్యాబ్ జడ్7హెచ్+’

ప్రముఖ దేశవాళీ బ్రాండ్ లావా తన పాత ట్యాబ్లెట్ ‘ఈట్యాబ్ జడ్7హెచ్’కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ‘ఈట్యాబ్ జడ్7హెచ్+’ పేరుతో సరికొత్త ట్యాబ్లెట్ పీసీని మార్కెట్‌కు పరిచయం చేసింది. ధర రూ.5,499. అయితే పాత వర్షన్‌తో పోలిస్తే ‘జడ్7హెచ్+’ తక్కువ స్థాయి ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే…. 7 అంగుళాల డిస్ ప్లే,  రిసల్యూషన్ 800x 480పిక్సల్స్,  4జీబి ఇంటర్నల్ మెమెరీ,  512ఎంబి డీడీఆర్3 ర్యామ్, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, ప్రీలోడెడ్ అప్లికేషన్స్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot