Home
Mobile

తక్కువ ధరలో AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్.. సేల్‌ ఎప్పటి నుంచంటే?

Lava Blaze AMOLED 2 5G Smartphone : లావా నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. లావా బ్లేజ్‌ అమోలెడ్‌ 2 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ అమోలెడ్‌ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ సహా అనేక ఆకట్టుకొనే ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. బడ్జెట్‌ రేంజ్‌లో మంచి డిస్‌ప్లే ఫోన్‌ కోసం చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్‌ అనుకూలంగా ఉంటుంది.

లావా బ్లేజ్‌ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR ను సపోర్టు చేస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Lava Blaze Amoled 2 5G smartphone launched in india

రెండు సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 6GB LPDDR ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌, రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా లావా స్మార్ట్‌ఫోన్‌ 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరాను అమర్చి ఉంది. మరియు LED ఫ్లాష్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Lava Blaze Amoled 2 5G smartphone launched in india

కూలింగ్‌ ఛాంబర్‌, స్టీరియో స్పీకర్లు :
ఈ హ్యాండ్‌సెట్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ప్రత్యేకమైన కూలింగ్‌ ఛాంబర్‌ను అమర్చి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.2, USB-C, GPS ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

లావా బ్లేజ్‌ అమోలెడ్ 2 5G ధర, సేల్‌ వివరాలు :
లావా బ్లేజ్‌ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13499 గా ఉంది. ఈ ఫోన్‌ సేల్‌ ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫిథర్‌ వైట్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

* గత నెలలో లావా నుంచి బ్లేజ్‌ డ్రాగన్‌ 5G ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. గోల్డ్‌ మిస్ట్‌, మిడ్‌నైట్ మిస్ట్‌ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.9999 గా ఉంది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ 18W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత క్లీన్ OS ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP AI కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Lava Blaze Amoled 2 5G smartphone launched in india, sale to start from august 16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X