Home
Mobile

రూ.6999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ. 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్లకు భారీ డిమాండ్‌ ఉంటోంది. అందువల్ల వివిధ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు ఈ ధరలో తమ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. గత వారం రూ.7999 ధరకు వివో V19e ఫోన్‌ విడుదల అయింది. తాజాగా దేశీయ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా ఈ ధర సెగ్మెంట్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. లావా షార్క్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను (Lava Shark Smartphone) విడుదల చేసింది.

భారత్ మార్కెట్‌లో లావా షార్క్ స్మార్ట్‌ఫోన్‌ రూ.6999 ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ధరలోనూ సూపర్ డిజైన్‌తోపాటు మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉంది. లావా రిటైల్‌ స్టోర్‌ల ద్వారా ఈ ఫోన్‌ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. లావా షార్క్ స్మార్ట్‌ఫోన్‌ టైటానియం గోల్డ్‌, స్టెల్త్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

Lava Shark Smartphone launched with 50MP camera in india

లావా షార్క్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
లావా ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ (Lava New Smartphone) ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. పంచ్‌ హోల్ డిజైన్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ లావా హ్యాండ్‌సెట్ UNISOC T606 ప్రాసెసర్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్‌, 64GB స్టోరేజీతో జతచేసి ఉంది. వర్చువల్‌ ర్యామ్ ఫీచర్‌తో అదనంగా 4GB ర్యామ్ వరకు పొడిగించుకొనేందుకు అవకాశం ఉంది. మైక్రో SD కార్డుతో 256GB స్టోరేజీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 14 OS పైన పనిచేస్తుంది.

కెమెరా, బ్యాటరీ వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ 50MP AI కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా యూనిట్‌ HDR, Pro మోడ్‌, పొర్ట్రెయిట్‌, AI మోడ్‌ వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Take a Poll

కనెక్టివిటీ ఫీచర్‌లు :
కనెక్టివిటీ పరంగా ఈ లావా ఫోన్‌ బ్లూటూత్‌ 5.0, వైఫై 802.11, డ్యూయల్‌ 4G VoLTE ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఫేస్‌ అన్‌లాక్, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌లను కలిగి ఉంది. ఫేస్‌ అన్‌లాక్‌ 0.68 సెకన్లలోనే స్పందిస్తుందని తెలుస్తోంది. అదే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ 0.28 సెకన్లలో స్పందిస్తుందని తెలుస్తోంది.

Lava Shark Smartphone launched with 50MP camera in india

లావా షార్క్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది. ఈ ఫోన్‌ కొనుగోలుపై సంవత్సరం వారంటీని అందిస్తున్నట్లు లావా తెలిపింది. దీంతోపాటు హోం సర్వీస్‌ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ లావా ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

* ఈ సంవత్సరం జనవరిలో లావా యువ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.6000 గా ఉంది. గ్లోసీ బ్లూ, గ్లోసీ లావెండర్‌, గ్లోసీ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ కొనుగోలుపై సంవత్సరం వరకు వారంటీని అందిస్తున్నట్లు లావా తెలిపింది.

లావా యువ స్మార్ట్‌ స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల (720*1600) HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 గో ఎడిషన్‌, Unisoc 9863A ఆక్టా కోర్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 10W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా 13MP ప్రైమరీ కెమెరా సహా AI ఆధారిత మరో కెమెరాను అమర్చారు. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా కలిగి ఉంది. 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ మరియు ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌లను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Shark Smartphone launched with 50MP camera in india at rs6999 price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X