నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ మొదటి లుక్!

D1C పేరుతో నోకియా లాంచ్ చేయబోతున్న ఆండ్రాయిడ్ డివైస్‌కు సంబంధించి గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో అనేక రూమర్స్ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసందే. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన మొదటి లుక్ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weiboలో హల్‌చల్ చేస్తుంది.

Read More : రూ.6,000 నుంచి రూ.12,000లోపు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బేసిక్ ఇంకా స్టాండర్డ్ మోడల్స్‌లో..

ఈ ఫోటోలను బట్టి చూస్తుంటే నోకియా D1C స్మార్ట్‌ఫోన్ బేసిక్ ఇంకా స్టాండర్డ్ మోడల్స్‌లో రాబోతున్నట్లు తెులస్తోంది. మెటల్ ఫ్రేమ్ అలానే పాలీ కార్బోనేట్ కలర్ బ్యాక్ ప్యానల్స్‌తో ఈ ఫోన్ కనువిందు చేయనుంది.

కొద్ది రోజుల క్రితం..

కొద్ది రోజుల క్రితం నోకియా D1C డివైస్‌ను 13.8 అంగుళాల డిస్‌ప్లేతో కూడిన టాబ్లెట్‌గా అభివర్ణిస్తూ GFXBench పలు వివరాలు విడుదల చేసింది. ఈ రిపోర్ట్ వెలువడిన తరువాత నోకియా D1C స్మార్ట్‌ఫోన్ కాదని, టాబ్లెట్ మాత్రమేనని అనుకున్నారు.

Nokiapoweruserతో క్లారిటీ వచ్చింది..

Nokiapoweruser అనే వెబ్‌సైట్ నోకియా డీ1సీ, 4.8 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్ అని క్లారిటీ ఇవ్వటంతో పలు ఊహాగానాలకు తెరపడింది.

Nokia D1C ఫోన్‌ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్

పలు అనధికారిక కధనాల ప్రకారం Nokia D1C ఫోన్‌కు సంబంధించి కొన్ని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూమర్ 1

Nokia D1C స్మార్ట్‌ఫోన్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్.

రూమర్ 2

Nokia D1C స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇది లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కావటం విశేషం.

రూమర్ 3

1.4గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 SoCను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే చిప్‌సెట్‌ను రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లలో వినియోగించారు.

రూమర్ 4

Nokia D1C స్మార్ట్‌ఫోన్ 3జీబి ర్యామ్‌తో రాబోతున్నట్లు GeekBench అలానే AnTuTu లిస్టింగ్స్ చెబుతున్నాయి.

రూమర్ 5

స్నాప్‌డ్రాగన్ 430 SoCతో వచ్చే ఫోన్ ఖచ్చితంగా ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి Nokia D1C స్మార్ట్‌ఫోన్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది.

రూమర్ 6

స్టోరేజ్ విషయానికి వచ్చేసిరికి ఈ డివైస్ లో 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. కెమెరా విషయానికి వచ్చేసరికి ఫోన్ వెనుక భాగంలో 16 మెగా పిక్సల్, ఫోన్ ముందుగ భాగంలో 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమచారం.

రూమర్ 7

Nokia D1C స్మార్ట్ ఫోన్ లో 4జీ ఎల్టీఈ వంటి ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లతో పాటుగా బ్లుటూత్, జీపీఎస్, వై-ఫై, యాక్సిలరోమీటర్, డిజిటల్ కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్, పిడోమీటర్ వంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయ్! శాటిలైట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన చైనా

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Leaked Images Suggest the Nokia D1C is Not a Tablet; Indeed it's a Smartphone With 5-inch Display. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot