మోటో జీ5, జీ5 ప్లస్ అసలు స్వరూపం ఇదే..

Written By:
అందరూ అనుకున్నట్లుగానే మోటో జీ5 వస్తోంది. ఫిబ్రవరి 26న బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో లెనోవో తన కొత్త ఫోన్ మోటో జీ5ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోటోలు లీకయ్యాయి. ట్విట్టర్ పేజీ @evleaksలో ఈ ఫోటోలు దర్శనమిచ్చాయి.వీటిని ఆన్‌లైన్ రీటెయిలర్ Ktronix ఈ ఇమేజెస్‌ని షేర్ చేసి వెంటనే డిలీట్ చేసింది. అయితే ఈ లోపే ఈ ఫోటోలు అందరూ డౌన్ లోడ్ చేసుకున్నారు. లీకయిన ఫోటోలను బట్టి ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ5 డిస్ ప్లే

లీకయిన రిపోర్టుల ప్రకారం మోటో జీ5 5 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేతో రానుంది. అలాగే 1.4GHz ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 processorతో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

ర్యామ్

2జిబి ర్యామ్ , 32 జిబి ఇంటర్నల్ స్టోరేజితో ఫోన్ రానున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. బ్యాటరీ విషయానికొస్తే 2800mAh battery. కెమెరా విషయానికొస్తే 13 మెగా ఫిక్సల్ రేర్ కెమెరాను పొందుపరిచారు

జీ5 ప్లస్ డిస్ ప్లే

మోటో జీ5 ప్లస్ విషయానికొస్తే 5.2 ఇంచ్ పుల్ డిస్ ప్లే 2.0GHz octa-core Snapdragon 625 processor తో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

ర్యామ్

64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 2 జిబి ర్యామ్ తో ఈ ఫోన్ రానుంది. ఫ్రంట్ కెమెరా 12 మెగా ఫిక్సల్ గా ఉంటుందని అంచనా. దీంతో పాటు డ్యూయెల్ ఆటోఫోకస్ ఫిక్సల్ ను కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది.

ధర

మోటో జీ5 ధర విషయానికొస్తే 2 జిబి ర్యామ్ ఫోన్ దాదాపు రూ. 13, 500 ఉండే అవకాశం ఉంది. అదే 3 జిబి ర్యామ్ ఫోన్ అయితే రూ. 14, 800గా ఉండే అవకాశం ఉంది. అయితే మోటోరోలా 2జిబి ర్యామ్ ఫోన్ల మీదనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Leaked official images show every detail of the Moto G5 and G5 Plus read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot