3డీ టచ్ ఫీచర్‌, 6 జిబి ర్యామ్‌తో షియోమి మి5ఎస్ !

Written By:

చైనా ఆపిల్ గా పేరుగాంచిన షియోమి ఫోన్లంటే చాలామందిలో ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఆ కంపెనీ నుంచి కొత్త ఫోన్ ఏం వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. మొన్న ఈ మధ్య షియోమి నుంచి వచ్చిన మి5 స్మార్ట్ ఫోన్ కూడా రికార్డు స్థాయి అమ్మకాలను కొల్లగొట్టింది. అయితే ఇప్పుడు అదే ఊపులో షియోమి నుంచి మరో కిల్లర్ ఫోన్ రానున్నట్లుగా కొన్ని వార్తలు లీకయ్యాయి. ఈ ఫోన్ 6జిబి ర్యామ్ తో రానున్నట్లు తెలుస్తోంది.

అనుకున్నట్లుగానే ఆ ఫోన్ ధర రూ. 2 వేలు తగ్గింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మి5ఎస్ స్మార్ట్‌ఫోన్

షియోమి నుంచి త్వరలో రానున్న మి5ఎస్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోన్ కి సంబంధించి సరికొత్త ఫీచర్లు లీకయ్యాయి.

లీకయిన వార్తల ప్రకారం

లీకయిన వార్తల ప్రకారం షియోమి మి5ఎస్ 2.4 గిగాహెడ్జ్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ( Image: Xiaomi Mi 5 )

డిస్ ప్లే

ఇక డిస్ ప్లే విషయానికొస్తే 5.15 అంగుళాల డిస్‌ప్లే, 3డీ టచ్ సపోర్టును కలిగి ఉంటుందని లీకేజీలు పేర్కొంటున్నాయి.( Image: Xiaomi Mi 5 )

ర్యామ్

ఇక ర్యామ్ విషయానికొస్తే 6జీబీ ర్యామ్‌తో పాటు 256 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ కెపాసిటీ ని కలిగి విస్తరణ సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉన్నట్లు లీకయిన వార్తలు తెలియజేస్తున్నాయి. ( Image: Xiaomi Mi 5 )

కెమెరా

కెమెరా కూడా అదిరే స్థాయిలో రానుందని తెలుస్తోంది. 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 4 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4కే వీడియో సపోర్టింగ్, డ్యూయల్ సిమ్‌తో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ( Image: Xiaomi Mi 5 )

షియోమి మి5 మాదిరిగానే

అయితే ఈ ఫోన్ ఇంతకుముందు వచ్చిన షియోమి మి5 మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. జీపీఆర్ఎస్/ఈడీజీఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3జీ, 4జీ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ, 3490 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానున్నదని సమాచారం. ( Image: Xiaomi Mi 5 )

మి నోట్2 విడుదల లీకేజీలు

ఈ ఫోన్‌తో పాటు మి నోట్2 విడుదల లీకేజీలు కూడా సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఈ రెండు ఫోన్లను ఈ నెల్లోనే విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ సారి ఈ ఫోన్లు చైనాలో విడుదలయిన వెంటనే ఇవి భారత్ లోకి వస్తాయని సమాచారం. ( Image: Xiaomi Mi 5 )

3డీ టచ్ ఫీచర్

ఇంతకు ముందు వచ్చిన షియోమి మి5కు 3డీ టచ్ ఫీచర్ లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందిన విషయం విదితమే. అయితే రానున్న ఫోన్ ఆ కొరతను తీర్చనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిపోర్టులు కూడా చెబుతున్నాయి. ( Image: Xiaomi Mi 5 )

మి5 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

ఇదిలా ఉంటే మి5 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు షియోమి అనుకున్న స్థాయిలో జరగలేదని ధరను తగ్గించినా కాని అది భారీ స్థాయిలో అమ్మకాలను రాబట్టలేకపోయిందని కంపెనీ చెబుతోంది. రానున్న ఫోన్ ఈ కొరతను తీరుస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ( Image: Xiaomi Mi 5 )

ధర రూ.24,999

ఇండియాలో మి5 స్మార్ట్‌ఫోన్ ను రూ.24,999 ధర వద్ద లాంచ్ చేసింది . ఇది ఈ మధ్య రూ.2000 తగ్గి రూ.22,999 ధర వద్ద ట్యాగ్ అవుతోంది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో ఈ ఫోన్ విడుదలయింది.( Image: Xiaomi Mi 5 )

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Leaked: Xiaomi Mi 5s with Snapdragon 821, 6GB RAM surfaces online Read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot