Home
Mobile

20 సెకన్లలో 95,000 ఫోన్‌లు సేల్

By Sivanjaneyulu

తన మొదటి ఫ్లాష్ సేల్‌లో భాగంగా 70,000 ఫోన్‌లను కేవలం రెండు సెకన్లలో విక్రయించి రికార్డుల మోత మోగించిన LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రెండవ ఫ్లాష్ సేల్ లోను రికార్డులు మోత మోగించింది. ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా జరిగిన ఈ సేల్‌లో భాగంగా 20 సెకన్ల వ్యవధిలో 95,000 లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌‍లకు సంబంధించిన ఆర్డర్ లను అందుకున్నట్లు లీఇకో ఇండియా సీఓఓ అతుల్ వాసన్ తెలిపారు. ఈ సేల్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 10.30 లక్షల మంది నమోదయినట్లు ఆయన తెలిపారు. ఈ ఫోన్ మొదటి ప్లాష్ సేల్‌కు సంబంధించి 6,05,000 మంది రిజిస్టర్ అయ్యారు.

 20 సెకన్లలో 95,000 ఫోన్‌లు సేల్

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్)‌, 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ కనెక్టువిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

ఒక్కసారి చార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

మెటల్ బాడీ వస్తోన్న Le 1S స్మార్ట్‌ఫోన్‌కు bezel-less డిస్‌ప్లే క్లాసీ లుక్‌ను తీసుకువస్తుంది. యునిబాడీకి తోడైన స్లిమ్ ఫ్యాక్టర్ డివైస్‌కు ప్రీమియమ్ ఫీల్‌ను తీసుకువస్తుంది.

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

పనితీరు పరంగా Le 1S స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. ఫోన్‌లో పొందుపరిచిన 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్ ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రాసెసర్‌కు తోడైన 3జీబి ర్యామ్ సమర్థవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహద పడుతుంది.

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

 Le 1S స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ద్వారా బెటర్ క్వాలిటీ విజువల్స్‌ను మంచి వ్యూవింగ్ యాంగిల్స్‌లో వీక్షించవచ్చు.

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

 Le 1S స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.0 అపెర్చుర్, ఐఎస్ఓసెల్ సెన్సార్, పీడీఏఎఫ్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా బెస్ట్ క్వాలిటీ సెల్ఫీలు ఆస్వాదించవచ్చు.

 

 

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

Le 1S స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది.ఈ విప్లవాత్మక ఫింగర్ ప్రింట్ సెన్సార్ లీటచ్ పేటెంట్ టెక్నాలజీ పై స్పందిస్తుంది. ఈ సెన్సార్‌లో పొందుపరిచిన మిర్రర్ - సర్‌ఫేసిడ్ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ 99.3% ఖచ్చితమైన ఐడెంటిఫికేషన్‌తో ఫ్లాష్ రికగ్నిషన్‌ను కేవలం 0.15 సెకండ్లలో ఎనేబుల్ చేస్తుంది. 5 ఫింగర్ ప్రింట్‌ల ఆప్షన్‌తో కూడిన 360 డిగ్రీ టచ్ ఇన్ అన్‌లాక్ ఫీచర్‌‌ సెన్సార్‌కు మరో హైలెట్. యాంటీ స్ర్కాచ్ సామర్థ్యంతో వస్తున్న ఈ మిర్రర్ - సర్‌ఫేసిడ్ సెన్సార్ 6H మందాన్ని రీచ్ అయ్యింది.

 

 

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

Le 1S స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని ఫోన్‌లో పొందుపరిచారు. యూఎస్బీ టైప్-సీ సపోర్ట్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. Le 1S స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది.

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంది. మిర్రర్ - సర్‌ఫేసిడ్ ఫింగర్ ప్రింట్‌తో విడుదలైన మొట్ట మొదటి ఫోన్‌లుగా Letv Le 1S గుర్తింపు తెచ్చుకోవటం విశేషం.

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

LeEco Le 1s స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత

Le 1s ధర రూ.10,999, ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

Best Mobiles in India

English summary
LeEco Crosses The Magic Million, Creates Three Industry Records!.Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X