8జిబి కాదు..6జిబితోనే లీకో లీ ప్రో3..ఇంకా షాక్ ఏంటంటే..

Written By:

లీకో నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలోనే భారత్ లోకి రానుంది. LeEco Le Pro 3 పేరుతో రానున్న ఈ ఫోన్ పై ఫస్ట్ ప్లాష్ సేల్ కింద అమ్మకాలను వచ్చే వారం నుంచి ప్రారంభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ గోల్డ్ , సిల్వర్, గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంది. మొత్తం నాలుగు రకాల వేరియంట్స్ లో ఈ ఫోన్ ను లీకో లాంచ్ చేసింది. ధరలు కూడా బడ్జెట్ లోనే ఉంటాయని కంపెనీ చెబుతోంది.

అక్టోబర్ 4న ఆపిల్‌కు గూగుల్ ఎలాంటి షాకివ్వబోతోంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర

4GB RAM + 32GB ధరను CNY 1,799 గా ప్రకటించింది. ఇది మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ 18, 100 ఉండే అవకాశం ఉంది. 6GB RAM + 64GB ఫోన్ రూ. 21,100 గా ఉంది.

Zhang Yimou edition

కంపెనీ వీటితో పాటు చైనీస్ ఫిల్మ్ మేకర్ పేరు మీదుగా Zhang Yimou edition ఫోన్ ను రిలీజ్ చేసింది. 4GB RAM + 64GB కలిగిన ఈ ఫోన్ ధర రూ. 25,100, 6GB RAM + 128GB కలిగిన ఫోన్ రూ. 30, 100గా నిర్ణయించింది.

6జిబి ర్యామ్

LeEco Le Pro 3 ఫోన్ 8జిబితో రానున్నట్లు వార్తలు హల్ చల్ చేసిన విషయం విదితమే. అయితే కంపెనీ కేవలం 6జిబి ర్యామ్ తో ఈ ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

ఫోన్ మొమొరీని మాత్రమే

అంతే కాకుండా మైక్రో ఎస్టీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునేందుకు ఈ ఫోన్‌లో అవకాశం లేదు. కేవలం ఫోన్ మెమొరీని మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది.

ఒక్క సిమ్ మాత్రమే 4జీకి సపోర్ట్

మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈఫోన్ లో ఒక్క సిమ్ మాత్రమే 4జీకి సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అదనంగా ఇచ్చింది.

ఆడియో

లీకో ప్రో3లో 3.5mm headphone jack ఉంటుంది. దీనికి అదనంగా లీకో ప్రో 3లో హై ఢెపినిట్లీ ఆడియోని తీసుకొచ్చింది. డాల్బే Atmos-powered audioతో ఈ ఫోన్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

Android 6.0 Marshmallow

లీకో లీ ప్రో 3 Android 6.0 Marshmallow EUI 5.8 మీద ఆపరేట్ అవుతుంది. 5.5 అంగుళాల 2కే డిస్‌ప్లే, ఫుల్ హైడెఫినిషన్ ప్యానల్, 2.5డి కర్వుడ్ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తోంది.

ప్రాసెసర్

2.35GHz quad-core Qualcomm Snapdragon 821 SoC Adreno 530 మీద ఈ ఫోన్ రన్ అవుతుంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 16 మెగా ఫిక్సల్ కెమెరాతో హై ఢెఫినేషన్ ఫోటోలు తీసుకోవచ్చు. 4కె వీడియో రికార్డింగ్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 8 ఎంపీ తో అదిరిపోయే విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. స్లో మోషన్ అదనపు బలం.

బ్యాటరీ

Wi-Fi 802.11 a/b/g/n/ac, NFC, GPS/ A-GPS, and Bluetooth v4.2, apart from USB Type-C అదనపు ఫీచర్లు, బ్యాటరీ విషయానికొస్తే 4070mAh. బరువు 175 గ్రాములు ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le Pro 3 Launched: Price, Release Date, Specifications, and More read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot