అక్టోబర్ 4న ఆపిల్‌కు గూగుల్ ఎలాంటి షాకివ్వబోతోంది..?

Written By:

ఇప్పుడు టెక్ ప్రపచంలో పోటీ ఎవరిదంటే గూగుల్ ఆపిల్‌దేనని చెప్పాలి. ఆండ్రాయిడ్ తో గూగుల్ దూసుకొస్తుంటే దానికి పోటీగా ఓఎస్ తో ఆపిల్ సవాల్ విసురుతోంది. అయితే ఇప్పుడు గూగుల్ ఆపిల్ కు ఏం షాకివ్వబోతోందనేది అందరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది. అక్టోబర్ 4న గ్రాండ్ ఈవెంట్ ఉన్న నేపథ్యంలో అందరి కళ్లు దాని మీదనే ఉన్నాయి. మరి ఆ రోజు గూగుల్ ఎలాంటి షాకివ్వబోతోంది. ఆసక్తిగొలుపుతున్న కథనం మీకోసం.

గత నెలలో ఆసియా మార్కెట్‌‌‌ని షేక్ చేసిన ఫోన్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ వర్సెస్ గూగుల్

ఇటీవలే ఆపిల్ తన ఈవెంట్లో ఐఫోన్ 7, 7 ప్లస్, వాచ్ 2 వంటి ఉత్పత్తులను, ఐఓఎస్ 10, వాచ్ ఓఎస్ 3 వంటి సాఫ్ట్‌వేర్లను విడుదల చేసిన విషయం విదితమే.అయితే దీనికి పోటీగా రానున్న ఈవెంట్‌లో గూగుల్ ఇతర గ్యాడ్జెట్లు, సాఫ్ట్‌వేర్లపై ఏమైనా ప్రకటనలు చేస్తుందా, లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

గూగుల్ నెక్సస్ సీరిస్ ఫోన్లు

ఎల్‌జీ, హువావే వంటి సంస్థలతో కలిసి గూగుల్ నెక్సస్ సీరిస్ ఫోన్లు విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఇప్పుడు గూగుల్ వీటికి బదులుగా ఇప్పుడు పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ ల పేరిట మొబైల్స్ ను ఆ ఈవెంట్ లో విడుదల చేస్తుందని తెలుస్తోంది.

హెచ్‌టీసీ‌తో కలిసి

హెచ్‌టీసీ‌తో కలిసి రూపొందించిన ఈ పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ ఫోన్లు అదిరే ఫీచర్లతో రానున్నాయని అప్పుడే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే గూగుల్ ఈ ఫోన్లను తన సొంత బ్రాండ్‌తో తీసుకురానుంది.

సెయిల్ ఫిష్, మార్జిన్ కోడ్ పేర్లతో

సెయిల్ ఫిష్, మార్జిన్ కోడ్ పేర్లతో రాబోతున్న ఈ ఫోన్లు 5, 5.5 అంగుళాల డిస్‌ప్లే‌తో ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ సాప్ట్‌వేర్‌లో ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన వెర్షన్ నోగట్‌తో ఈ ఫోన్లను లాంచ్ చేస్తుందని సమాచారం.

ఆండ్రాయిడ్ నూగట్ 7.0 పూర్తి స్థాయి వెర్షన్

వీటితో పాటు ఇటీవలే డెవలపర్ ప్రివ్యూగా విడుదలైన ఆండ్రాయిడ్ నూగట్ 7.0 పూర్తి స్థాయి వెర్షన్, అందులో ఉండబోయే ఫీచర్లు, భవిష్యత్తులో రానున్న ఇతర గూగుల్ ఉత్పత్తుల గురించి కూడా ఆ ఈవెంట్లో గూగుల్ వెల్లడిస్తుందని సమాచారం.

అక్టోబర్ 4 ఈవెంట్ పట్ల ఆసక్తి

ఈ క్రమంలో గూగుల్ నిర్వహించబోయే అక్టోబర్ 4 ఈవెంట్ పట్ల టెక్ కంపెనీలు, మొబైల్ తయారీ సంస్థలు, వినియోగదారుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇన్ని రోజులు శాంసంగ్ నుంచి ఎదుర్కొన్న పోటీ ప్రస్తుతం ఆపిల్‌కు, గూగుల్ నుంచి కూడా ఎదురుకాబోతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

అక్టోబర్ 4 న ఉదయం 9 గంటలకు

అక్టోబర్ 4 న ఉదయం 9 గంటలకు నిర్వహించబోయే ఈ ప్రత్యేక ఈవెంట్‌కు గూగుల్ ఆహ్వానాలు సైతం పంపించేసిందట. ఈ ఈవెంట్ టీజర్ వీడియోను గూగుల్, యూట్యూబ్‌లో కూడా పెట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Confirms Oct 4 Launch Event, Teases Made by Google read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot