అందుబాటులో లక్ష లెనోవో ఏ6000 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

చైనా స్మార్ట్‌ఫోన్‌‌ల కంపెనీ లెనోవో కొద్ది రోజల క్రితం ‘లెనోవో ఏ6000 ప్లస్' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ‘ఏ6000' ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన ఈ ఫోన్ ధర రూ.7,499. ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఫ్లాష్‌సేల్ ఏప్రిల్ 28, మధ్యాహ్నం 2 గంటలకు ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభమవుతాయి.(క్వాడ్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు)

అందుబాటులో లక్ష లెనోవో ఏ6000 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు

తాజాగా వెల్లడవుతోన్న సమాచారం మేరకు ఏప్రిల్ 28న ప్రారంభమయ్యే ‘లెనోవో ఏ6000 ప్లస్' మొదటి ఫ్లాష్‌సేల్‌ను పురస్కరించుకుని లెనోవో & ఫ్లిప్‌కార్ట్‌లు 100,000 ఏ6000 ప్లస్ యూనిట్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. మొదటి ఫ్లాష్‌సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 27, ఏప్రిల్ అర్థరాత్రి 11.59 నిమిషాలతో ముగుస్తుంది.

అందుబాటులో లక్ష లెనోవో ఏ6000 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఏ6000కు సక్సెసర్ వేరియంట్‌గా అందుబాటులోకి రాబోతున్న లెనోవో ఏ6000 ప్లస్.. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ వంటి మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. లెనోవో ఏ6000 ప్లస్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ (64 బిట్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

English summary
Lenovo A6000 Plus: 1 Lakh Units to Go on First Flash Sale on Flipkart. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot