లెనోవో ఏ6000 ప్లస్ వచ్చేసింది, ధర రూ.7,499
లెనోవో ఏ7000 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై పట్టు సాధించిన లెనోవో మరో ప్రయత్నంగా ‘లెనోవో ఏ6000 ప్లస్'ను బరిలోకి దింపింది. ఈ ఫోన్ ధర రూ.7,499. ఈ ఫోన్ లకు సంబంధించిన మొదటి ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 28, మధ్యాహ్నం 2 గంటలకు ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభమవుతాయి.

లెనోవో ఏ6000కు సక్సెసర్ వేరియంట్‌గా అందుబాటులోకి రాబోతున్న లెనోవో ఏ6000 ప్లస్.. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ వంటి మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది.

లెనోవో ఏ6000 ప్లస్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ (64 బిట్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.
ఇంకా చదవండి: ఫేస్‌బుక్‌లో ఎంతెంత జీతాలు..?


Click it and Unblock the Notifications








