తొలిసారిగా ఓపెన్ సేల్‌‌పై లెనోవా

Written By:

చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ లెనోవా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వైబ్ కె 5 తో తొలిసారిగా ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులోకి వస్తోంది. లెనోవా అభిమానులు అలాగే ఆసక్తి ఉన్న వినియోగదారులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి అవసరం లేకుండానే అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్ లో ఈ ఫోన్ 6,999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇప్పటికే లక్ష మొబైళ్ల అమ్మకాలు జరిగాయని కంపెనీ తెలిపింది. ఇండియాలో వైబ్ కెకు మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఎల్టీఈ క్యాట్ 4 మద్దతుతో 150 యంబీసీఎస్ డౌప్ లోడ్ వేగం, 50 యంబీపీఎస్ అప్ లోడ్ వేగంతో పనిచేస్తుంది.

ఆ లెనోవో ఫోన్‌లో అంత దమ్ముందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తొలిసారిగా ఓపెన్ సేల్‌‌పై లెనోవా

లెనోవ్ వైబ్ కే5 ఫోన్ డిజైన్ విషయానికొస్తే ప్లాస్టిక్ ఇంకా మెటల్ కాంభినేషన్‌లో ఫోన్ నిర్మాణం ఉంటుంది. ప్లాటినమ్ సిల్వర్, చాంపేన్ గోల్డ్, గ్రాపైట్ గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

తొలిసారిగా ఓపెన్ సేల్‌‌పై లెనోవా

వైబ్ కే5 ఫోన్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. (రిసల్యూషన్ సామర్థ్యం 1280 x 720పిక్సల్స్), 180 డిగ్రీ వైడ్ యూగింగ్ వ్యూవింగ్ సామర్థ్యాలను ఈ ఫోన్ డిస్‌ప్లే కలిగి ఉంది.

తొలిసారిగా ఓపెన్ సేల్‌‌పై లెనోవా

వైబ్ కే5 ఫోన్‌లో 1.4గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఆకట్టుకుంటుంది. క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్ బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది.

తొలిసారిగా ఓపెన్ సేల్‌‌పై లెనోవా

వైబ్ కే5 ఫోన్ 2జీబి ర్యామ్‌తో వస్తోంది. 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

తొలిసారిగా ఓపెన్ సేల్‌‌పై లెనోవా

వైబ్ కే5 ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్). 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

తొలిసారిగా ఓపెన్ సేల్‌‌పై లెనోవా

లెనోవో వైబ్ కే5 ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం.

తొలిసారిగా ఓపెన్ సేల్‌‌పై లెనోవా

లెనోవో వైబ్ కే5 ఫోన్, డాల్బీ ఆడియో టెక్నాలజీతో వస్తంది. ఫోన్ సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3.5 ఎమ్ఏమ్ రేడియో, ఎఫ్ఎమ్ రేడియో).

తొలిసారిగా ఓపెన్ సేల్‌‌పై లెనోవా

లెనోవో వైబ్ కే5 ఫోన్ శక్తివంతమైన 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్ బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

తొలిసారిగా ఓపెన్ సేల్‌‌పై లెనోవా

లీఇకో లీ1ఎస్, షియోమీ రెడ్మీ నోట్ 3, మోటరోలా మోటో జీ3 ఫోన్‌లకు ఈ లెనోవో వైబ్ కే5 ఫోన్ కాంపిటీటర్‌గా నిలవనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Lenovo Vibe K5 to Be Made Available via Open Sale From Today
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot