ప్రపంచం ముందుకు వొంపు తిరిగిన ఎల్‌‍జీ స్మార్ట్‌ఫోన్ ‘జీ ఫ్లెక్స్ 2'

Posted By:

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2015 వేదికగా ఎల్‌జీ తన కర్వుడ్ స్ర్కీన్ ‘జీ ఫ్లెక్స్ 2' స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. తాము గతేడాది విడుదల చేసిన ‘జీ ఫ్లెక్స్' ఫోన్‌కు వినియోగదారుల నుంచి పాజిటివ్ స్పందన లభించటంతో మరింత అడ్వాన్సుడ్ కర్వుడ్ డిజైనింగ్‌తో కూడిన జీ ఫ్లెక్స్ 2ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎల్‌జీ పేర్కొంది.

ప్రపంచం ముందుకు వొంపు తిరిగిన ఎల్‌‍జీ స్మార్ట్‌ఫోన్ ‘జీ ఫ్లెక్స్ 2'

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఎల్‌‍జీ జీ ఫ్లెక్స్ 2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

5.5 అంగుళాల కర్వుడ్ పీ-వోఎల్ఈడి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 403 పీపీఐ),
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెర్ట్జ్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టాకోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్4 ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (లేజర్ ఆటో ఫోకస్, వోఐఎస్+),
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సీఈఎస్ 2015: విడుదల కాబోతున్న 10 హైక్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు..4జీ ఎల్టీఈ, హెచ్ఎస్‌పీఏ+ 21/42 ఎంబీపీఎస్, వై-ఫై 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ స్మార్ట్‌రెడీ (ఏపీటీ-ఎక్స్) 4.1, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఏ-జీపీఎస్/గ్లోనాస్, యూఎస్బీ 2.0. ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్‌లు.. గెస్ట్యర్ షాట్, గెస్ట్యర్ వ్యూ, గ్లాన్స్ వ్యూ, ఫాస్ట్ చార్జ్.

ఫోన్ బరువు 152 గ్రాములు, చుట్టుకొలత 75.3 x 7.1-9.4 మిల్లీమీటర్లు. సెల్ఫ్ హీలింగ్ బ్యాక్ ప్రత్యేకతతో లభ్యంకానున్న ఈ ఫోన్ కొరియా మార్కెట్లో ఈ నెలాకరు నుంచి అందుబాటులో ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడికావల్సి ఉంది.

English summary
LG G Flex 2 Launched with 5.5-inch Full HD Curved P-OLED Display at CES 2015. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot