ఐఫోన్7, గూగుల్ పిక్సల్ ఫోన్లకు సవాల్ విసురుతున్న ఫోన్ ఇదే !

Written By:

ఎల్‌జీ లేటెస్ట్ గా దూసుకొచ్చిన గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ నోగట్ తొలి స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ వీ 20 త్వరలో భారత మార్కెట్లోకి దూసుకురాబోతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా విడుదలై సంచలనం రేపిన ఈ ఫోన్ భారత మార్కెట్లో కూడా అదే అధ్భుతాలను సృష్టించే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. మరీ దీని ఫీచర్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

చేధించలేని మిస్టరీ : ఈ నంబర్ వాడిన వాళ్లంతా చనిపోతున్నారు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ నోగట్ తొలి స్మార్ట్‌ఫోన్

ఎల్‌జీ నుంచి రానున్న ఆండ్రాయిడ్ నోగట్ తొలి స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ వీ20 ఈ నెలాఖరున భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. రూ .49,990 ధరతో భారత మార్కెట్లోకి ఈ ఫోన్ రానుంది.

వెనుక డ్యుయల్ కెమెరాలు

16 మెగాపిక్సెల్ స్టాండర్డ్, 8 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ డ్యుయల్ వెనుక కెమెరాలు కలిగిన ఈ ఫోన్, ఫ్రంట్ వైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను కలిగిఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డ్యూయల్ డిస్‌ప్లే సిస్టమ్‌

డ్యూయల్ డిస్‌ప్లే సిస్టమ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెండో డిస్‌ప్లే ఫోన్‌కి టాప్‌లో ఉంటుంది. మొదటి దానికంటే ఈ రెండో డిస్‌ప్లే ఎక్కువ ప్రకాశవంతంగా, పెద్ద ఫాంట్‌తో ఉండనుంది. దీని వల్ల నోటిఫికేషన్ బార్ నుంచే పెద్ద మెసేజ్లకు త్వరగా రిప్లై ఇవ్వొచ్చు.

5.7 అంగుళాల క్యూహెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ ప్లే

5.7 అంగుళాల క్యూహెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ ప్లేతో ఎల్‌జీ వీ20 వినియోగదారులను అలరించనుంది. క్వాల్ కామ్ స్నాప్‌ డ్రాగన్ 820 ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణ.

4 జీబీ ర్యామ్

4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు విస్తరణ c వంటివి ఈ ఫోన్ ఇతర ఫీచర్లు.

మల్టీమీడియా ఫీచర్లతో

హై-ఫై క్వాడ్ డీఏసీ, హెచ్‌డీ ఆడియో రికార్డర్, ఫ్రంట్, రియర్ వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా వంటి మల్టీమీడియా ఫీచర్లతో ఈ స్మార్ట్‌‌ఫోన్ కంపెనీ రూపొందించింది.

రేటు తక్కువ

భారత మార్కెట్లో ఇటీవల లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, గూగుల్ పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ల కంటే ఈ ఫోన్ రేటు తక్కువగా ఉండాలని కంపెనీ నిర్ణయించినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.

నవంబర్ ఆఖరులో

కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ నోగట్ తో వస్తోంది. నవంబర్ ఆఖరులో ఇండియాకి వచ్చే అవకాశం 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG may launch V20 at Rs 49,990 in India by November-end read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot