చేధించలేని మిస్టరీ : ఈ నంబర్ వాడిన వాళ్లంతా చనిపోతున్నారు !

Written By:

అందరూ ఫ్యాన్సీ నంబర్లంటే పడి చచ్చిపోతుంటారు. ఆ నంబర్ల కోం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. మరి అదే నంబర్ వారిని చంపేస్తే..ఏందీ నమ్మలేకున్నారా..అవును మీరు నమ్మలేని నిజం. ఆ నంబర్ వాడిన వారంతా చనిపోతున్నారు. అందుకే ఆ నంబర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటో మీరే చూడండి.

ఆ ఒక్కడి ఆస్తితో ఇండియా ఎలా బతికేస్తుందంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

0888888888

మిస్టరీగా మారిన నంబర్ ఇదే. 0888888888. చూడడానికి వెరైటీగా ఉన్న ఈ ల్యాండ్‌లైన్ నెంబర్‌పై తాజాగా రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నెంబర్ వాడిన వారంతా చనిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

మొబీటెల్ కంపెనీ సీఈవో

ఈ నెంబర్‌ను తొలిసారిగా వినియోగించిన మొబీటెల్ కంపెనీ సీఈవో క్యాన్సర్‌తో చనిపోయారు. కానీ బిజినెస్‌లో నెలకొన్ని వివాదాలే ఆయన చావుకు కారణమని ఆ తర్వాత కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి.

కన్‌స్టాన్‌టిన్ డిమిట్రోవ్

ఆ తర్వాత ఇదే నెంబర్‌ను ఉపయోగించిన కన్‌స్టాన్‌టిన్ డిమిట్రోవ్ అనే డ్రగ్ మాఫియా డాన్ ప్రత్యర్థుల చేతిలో నెదర్లాండ్స్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. అతను చనిపోయే సమయంలో ఫోన్ అతనితో పాటే ఉందని చెప్పుకుంటారు.

మూడో వ్యక్తి వ్యాపారవేత్త డిష్‌లివ్

ఇక ఇదే నెంబర్‌ను వాడిన మూడో వ్యక్తి వ్యాపారవేత్త డిష్‌లివ్. బల్గేరియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్ ఎదురుగా ఇతను కూడా 2005లో దారుణ హత్యకు గురయ్యాడు.

ఔట్‌సైడ్ నెట్‌వర్క్

2005 తర్వాత ఈ నెంబర్‌కు కాల్ చేసిన వారికి ఔట్‌సైడ్ నెట్‌వర్క్ కవరేజ్ అనే సమాధానమే వస్తోంది. 

నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారన్నది

ఈ చావులకు, ఫోన్ నెంబర్‌కు సంబంధం ఉన్నా, లేకపోయినా ఇలాంటివి కూడా నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారన్నది మాత్రం వాస్తవం.

వాటిని పూర్తిగా పుకార్లని

అయితే వాటిని పూర్తిగా పుకార్లని కొట్టిపారేయలేం. అలాగని ఆ నెంబర్ వాడినవారంతా చనిపోతున్నారని కూడా చెప్పలేం. కాని ఏదో మిస్టరీ మాత్రం ఆ నంబర్ లో దాగుందని చెప్పవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mobile phone number suspended after three users die in 10 years read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot