అదిరే ఫీచర్లతో LG నుంచి సరికొత్త ఫోన్, బడ్జెట్ ధరలో..

Written By:

LG తన సరికొత్త స్టైలిష్ ఫోన్ ,లార్జర్ వేరియంట్ స్టైలో 3ని లాంచ్ చేసింది. స్టైలో 3 ప్లస్ పేరుతో వచ్చిన ఈ మొబైల్ LG స్టైలో సీరిస్ లో మిడ్ రేంజ్ ఫోన్ అని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫోన్ ఇప్పుడు యూఎస్ లో మాత్రమే విడుదలయింది. ఇతర దేశాల్లో కంపెనీ ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయం ఇంకా చెప్పలేదు. దీని ధరను 225 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 14,600గా ఉండవచ్చు. ఫీచర్లు ఇలా ఉన్నాయి.

ఇండియాలో టాప్ డ్యూయెల్ కెమెరా ఫోన్స్ ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టైలిష్ పెన్

ఈ ఫోన్ లో ఉన్న అధ్బుతమైన ఫీచర్ ఏంటంటే స్టైలిష్ పెన్. దీంతో మీరు డూడుల్ అలాగే నోట్స్ లాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికొస్తే 5.7 ఇంచ్ పుల్ హైచ్‌డి ఐపీఎస్ డిస్‌ప్లే‌తో పాటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద ఆపరేట్ అవుతుంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 2జిబి ర్యామ్ తో పాటు 32 జిబి ఇంటర్నల్ స్టోరేజిని పొందుపరిచారు. మైక్రో ఎస్ డీ ద్వారా 2 టీబీ వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ ని పొందుపరిచారు. పుల్ హెడ్ డి వీడియో రికార్డు చేయవచ్చు.సెల్ఫీ షూటర్ల కోసం 5 మెగా ఫిక్సల్ కెమెరాని అందుబాటులో ఉంచారు. గెస్టర్ షాట్, సెల్పీ లైట్ , గెస్టర్ ఇంటర్వెల్ షాట్ లాంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 3,080mAh రిమూవల్ బ్యాటరీని అందించారు. 14 గంటలు స్టాండ్ బై టాక్ టైం ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, 4G LTE support, Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth v4.2, USB, and GPS. లాంటివి అదనపు ఫీచర్లు

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
LG Stylo 3 Plus with Android 7.0 Nougat, fingerprint sensor launched: Price, specifications and features Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot