క్రెడిట్ కార్డు సైజులో ఫోన్, ఇవీ ప్రత్యేకతలు!

స్మార్ట్‌ఫోన్ వినియోగం కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వినియోగదారుల కోసం క్రెడిట్ కార్డు సైజులో సరికొత్త సెల్‌ఫోన్ త్వరలో మార్కెట్లో రాబోతోంది. లైట్ ఫోన్ పేరుతో రాబోతున్న ఈ యాంటీ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. 2జీ నానో సిమ్ కార్డ్ స్లాట్‌తో వచ్చే ఈ ఫోన్ ద్వారా కాల్స్ మాత్రమే సాధ్యమవుతాయి.

Read More : 4000mAh బ్యాటరీతో లెనోవో ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సింగిల్ ఛార్జ్ పై మూడు వారాల బ్యాకప్‌

ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై మూడు వారాల బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేస్తాయి. కేవలం 38.5 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉండే ఈ ఫోన్ క్వాల్కమ్ 8208 సాక్ పై రన్ అవుతుంది.

ఓఎల్ఈడి డిస్‌ప్లేతో..

ఇంటర్నెట్‌కు అతుక్కుపోతున్నారా..?

ఫోన్ ముందు భాగంలో ప్రత్యేకమైన ఓఎల్ఈడి డిస్‌ప్లేను ఏర్పాటు చేయటం జరిగింది. ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్నెట్‌ను సపోర్ట్ చేయదు..

లైట్ ఫోన్ ఇంటర్నెట్‌ను సపోర్ట్ చేయదు. ఈ ఫోన్ లో కెమెరా కూడా ఉండదు. టచ్ మాడ్యుల్, మైక్రోఫోన్, మైక్రో యూఎస్బీ పోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ మాత్రమే ఈ ఫోన్‌లో ఉన్నాయి.

రూ.7,000 వరకు ఉండొచ్చు..

ఇతర దేశాలకు కాల్ చేస్తే నిమిషానికి రూ.1.4 పైసలే!

18 నెలల క్రితమే మార్కెట్లో అనౌన్స్ కాబడిన ఈ ఫోన్ ధర అమెరికా కరెన్సీలో 100 డాలర్లట. మన కరెన్సీలో షుమారుగా రూ.7,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

2జీ నెట్‌వర్క్ పై మాత్రమే..

2జీ నెట్‌వర్క్ పై స్పందించే ఈ ఫోన్‌ల పై పలు దేశాల యూజర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

2జీ నెట్‌వర్క్ సేవలను కొన్ని దేశాల్లో నిలిపివేస్తున్నారు..

10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్.. ఉద్యోగం గ్యారంటీ!

ఇందుకు కారణం, కొన్ని దేశాల్లో 2జీ నెట్‌వర్క్ సేవలను నిలిపివేస్తుండటమే. అడ్వాన్సుడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో ముందంజలో ఉండే ఆస్ట్రేలియాలో డిసెంబర్ 1, 2016 నుంచి 2జీ సేవలు నిలిపివేస్తున్నారు.

వారికి రీఫండ్ ఇచ్చేస్తాం..

దీంతో ఆస్ట్రేలియాలో ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న వారికి నగదును రీఫండ్ చేయటం జరుగుతుందని కంపెనీ పేర్కొనట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండాలనుకునే వారికి ఈ కాన్సెప్ట్ ఫోన్ ఉత్తమం. పోయిన ఫోన్‌లను వెతికి పట్టుకోవటం చాలా సులువు..

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Light Phone will begin shipping From November 30th. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot