బడ్జెట్ ధరకే.. 3జిబి ర్యామ్‌ జియో సపోర్ట్ ఫోన్

Written By:

జియోతో మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ అదే ఊపులో ఎల్‌వై‌ఎఫ్ ఫోన్లను విడుదల చేసుకుంటూ పోతోంది. మొన్న 'లైఫ్ వాట‌ర్ 10 విడుదల చేసిన కొద్ది రోజులకే ఇప్పుడు 'లైఫ్ వాట‌ర్ 11తో ముందుకు వచ్చింది. ఈ ఫోన్ ధర మార్కెట్లో రూ.8,199 వద్ద ట్యాగ్ అవుతోంది. 3జీబి ర్యామ్ తో పాటు 13 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఫీచర్స్ విషయానికొస్తే..

మీ కాల్స్‌కి కనెక్ట్ కాలేం..జియోకి షాకిచ్చిన దిగ్గజ టెల్కోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 1.3 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, మాలి టి720 గ్రాఫిక్స్ తో ఈ ఫోన్ కష్టమర్లను అలరిస్తుంది.

#2

3 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 64 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ మీద ఫోన్ ఆపరేట్ చేయవచ్చు.

#3

13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.

#4

4జీ వీఓఎల్‌టీఈ ప్రత్యేక అట్రాక్షన్, బ్లూటూత్ 4.1ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ అదనపు ఆకర్షణలు

#5

2100 ఎంఏహెచ్ బ్యాట‌రీ తో పాటు మరికొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 8,199. అన్ని రిలయన్స్ షో రూంలలో లభిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lyf Water 11 With 3GB of RAM, VoLTE Support Launched at Rs 8199 read more telugu gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot