రికార్డుల రేసులో Letv సూపర్‌ఫోన్స్

Written By:

ప్రముఖ మల్టీ-నేషనల్ టెక్నాలజీ కంపెనీ Letv స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు రేపుతోంది. Le 1s, Le Max మోడల్స్‌లో ఈ బ్రాండ్ చైనాలో విడుదల చేసిన రెండు ఫ్లాగ్‌షిప్ సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు అమ్మకాల సునామీని సృష్టించాయి. Letv ఒక్క నవంబర్‌లోనే ఏకంగా 10 లక్షల ఫోన్‌లను విక్రయించినట్లు సమచారం.

 రికార్డుల రేసులో Letv సూపర్‌ఫోన్స్

చైనా మార్కెట్లో మంచి స్పందన లభించిన నేపథ్యంలో ఈ రెండు ఫోన్‌లను Letv సంస్థ ఇండియాలో లాంచ్ చేసింది. Le 1s ధర రూ.10,999, Le Max ధర రూ.32,999.

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

ఈ సూపర్ ఫోన్‌లలో ఏర్పాటు చేసిన విప్లవాత్మక ఫింగర్ ప్రింట్ సెన్సార్ లీటచ్ పేటెంట్ టెక్నాలజీ పై స్పందిస్తుంది. ఈ సెన్సార్‌లో పొందుపరిచిన మిర్రర్ - సర్‌ఫేసిడ్ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ 99.3% ఖచ్చితమైన ఐడెంటిఫికేషన్‌తో ఫ్లాష్ రికగ్నిషన్‌ను కేవలం 0.15 సెకండ్లలో ఎనేబుల్ చేస్తుంది. 5 ఫింగర్ ప్రింట్‌ల ఆప్షన్‌తో కూడిన 360 డిగ్రీ టచ్ ఇన్ అన్‌లాక్ ఫీచర్‌‌ సెన్సార్‌కు మరో హైలెట్. యాంటీ స్ర్కాచ్ సామర్థ్యంతో వస్తున్న ఈ మిర్రర్ - సర్‌ఫేసిడ్ సెన్సార్ 6H మందాన్ని రీచ్ అయ్యింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Le 1S స్మార్ట్‌ఫోన్ స్పెక్స్

Le 1S స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ద్వారా బెటర్ క్వాలిటీ విజువల్స్‌ను మంచి వ్యూవింగ్ యాంగిల్స్‌లో వీక్షించవచ్చు

Le 1S స్మార్ట్‌ఫోన్ స్పెక్స్

ఫోన్‌లో పొందుపరిచిన 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్ ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రాసెసర్‌కు తోడైన 3జీబి ర్యామ్ సమర్థవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహద పడుతుంది.

Le 1S స్మార్ట్‌ఫోన్ స్పెక్స్

మెటల్ బాడీ వస్తోన్న Le 1S స్మార్ట్‌ఫోన్‌కు bezel-less డిస్‌ప్లే క్లాసీ లుక్‌ను తీసుకువస్తుంది. పూర్తి మెటల్ యునిబాడీకి తోడైన స్లిమ్ ఫ్యాక్టర్ డివైస్‌కు ప్రీమియమ్ ఫీల్‌ను తీసుకువస్తుంది.

Le 1S స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

Le 1S స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.0 అపెర్చుర్, ఐఎస్ఓసెల్ సెన్సార్, పీడీఏఎఫ్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా బెస్ట్ క్వాలిటీ సెల్ఫీలు ఆస్వాదించవచ్చు.

Le 1S స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

Le 1S స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని ఫోన్‌లో పొందుపరిచారు. యూఎస్బీ టైప్-సీ సపోర్ట్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. Le 1S స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది.

Le 1S స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంది. మిర్రర్ - సర్‌ఫేసిడ్ ఫింగర్ ప్రింట్‌తో విడుదలైన మొట్ట మొదటి ఫోన్‌లుగా Letv Le 1S గుర్తింపు తెచ్చుకోవటం విశేషం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meet Letv Superphones Which Boast World’s First Mirror-surfaced Fingerprint Scanner Technology!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot