రూ.1999కే 4జీ వోల్ట్ ఫోన్, దిగ్గజాలకు మైక్రోమ్యాక్స్ షాక్ !

Written By:

దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ దిగ్గజ కంపెనీలకు షాక్ ఇవ్వబోతోంది. కంపెనీ తన కొత్త ఫోన్ భారత్ 1ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. 4జీ సపోర్ట్ తో వస్తున్న ఈ ఫీచర్ ఫోన్ ధరను కేవలం రూ. 1999గా నిర్ణయించింది. ఇది భారత మార్కెట్ వచ్చే నాలుగు వారాల్లో షేక్ చేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఫోన్ లో మేజర్ హైలెట్ ఫీచర్ 4జీ వోల్ట్ సపోర్ట్ అని, కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చీఫ్ ఫోన్ ఇదేనని మైక్రోమ్యాక్స్ తెలిపింది. ఫోన్ జావా ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తుంది.

ఈ ఫోన్‌కి 10 రోజుల్లో రూ. 150 కోట్ల ఆర్డర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యంత తక్కువ ధరలో

మైక్రోమ్యాక్స్ కంపెనీ ఇంకా అత్యంత తక్కువ ధరలో ఫీచర్ ఫోన్లను తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. కంపెనీ రూమర్ల ప్రకారం రూ. 999కి ఒక ఫోన్ , రూ.1500కి ఇంకో ఫోన్ ని తీసుకురానున్నటట్లు తెలుస్తోంది.

మైక్రోమ్యాక్ప్ వాటికన్నా ముందుగానే తన 4జీ వోల్ట్ ఫోన్లను రిలీజ్ చేసి

ఈ మధ్య లావా 4జీ తన 4జీ వోల్ట్ ఫోన్ ను రూ. 3333 ధరలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే, జియో కూడా 4జీ వోల్ట్ ఫోన్లను అత్యంత తక్కువ ధరలకు అందిస్తానని చెబుతోంది. ఈ నేపథ్యంలో మైక్రోమ్యాక్ప్ వాటికన్నా ముందుగానే తన 4జీ వోల్ట్ ఫోన్లను రిలీజ్ చేసి మార్కెట్లో అధిక వాటాను కొల్లగొట్టాలని చూస్తోంది.

స్పోర్ట్స్ టచ్ టైప్ కెపాబులిటితో

ఈ ఫోన్ డిజైన్ స్పోర్ట్స్ టచ్ టైప్ కెపాబులిటితో రానున్నట్లు తెలుస్తోంది. మైక్రోమ్యాక్స్ బోల్ట్ క్యూ 324 ఇనిస్పిరేషన్ తో ఈ ఫోన్ డిజైన్ చేసినట్లు సమాచారం.

ఫీచర్లను అనౌన్స్ చేయలేదు

మరి కంపెనీ ఫీచర్లను అనౌన్స్ చేయలేదు. ఫోన్ వస్తుందని మాత్రం తెలిపింది. భారత్ 2 లో ఉన్న ఫీచర్స్ తోనే ఈ ఫోన్ రావచ్చని సమాచారం.

ఫోన్ జావా ఆపరేటింగ్ సిస్టంతో

ఫోన్ లో మేజర్ హైలెట్ ఫీచర్ 4జీ వోల్ట్ సపోర్ట్ అని, కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చీఫ్ ఫోన్ ఇదేనని మైక్రోమ్యాక్స్ తెలిపింది. ఫోన్ జావా ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Bharat 1 VoLTE-enabled feature phone coming soon for Rs 1,999 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot