ఏడాదిపాటు 4జీ డేటా ఫ్రీ, అన్‌లిమిటెడ్ కాల్స్..

Written By:

నోకియా ఇన్‌స్పిరేషన్‌తో మైక్రోమ్యాక్స్ సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. కాన్వాస్ 2 2017 పేరుతో వచ్చిన ఈ మొబైల్‌ను ఎయిర్‌టెల్ పార్టనర్ షిప్‌తో లాంచ్ చేసింది. ఈ మొబైల్ కొన్నవారికి ఎయిర్‌టెల్ 4జీ డేటా ఏడాది పాటు ఉచితంగా కంపెనీ అందించనుంది. దీంతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ ని వినియోగదారులు అందుకోవచ్చు. అయితే డైలీ 1 జిబి మాత్రమే వినియోగదారులు వాడుకోవాల్సి ఉంటుంది.

రూ. 3700కే కత్తి లాంటి 4జీ వోల్ట్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధరను

కంపెనీ ఈ ఫోన్ ధరను రూ. 11,999గా నిర్ణయించింది. మైక్రోమ్యాక్స్ రీటెయిల్ అవుట్ లెట్లలో మే 17 నుంచి లభ్యమవుతోంది. ఫోన్ తో పాటు ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్ pre-bundled వినియోగదారులకు లభిస్తాయి.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5

ఈ ఫోన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,. ఈ ఫీచర్ తో కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం గమనార్హం. 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో పాటు 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగిఉంది. దీంతో పాటు 1-year screen replacement promise కూడా ఇస్తున్నారు.

 

ర్యామ్

3 జీబీ ర్యామ్ తో పాటు , 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంటుంది.

కెమెరా

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు సెల్ఫీ అభిమానుల కోసం 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

3050 ఎంఏహెచ్ బ్యాటరీ

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 4.0, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Micromax Canvas 2 (2017) With 1 Year of Free 4G Data From Airtel, Gorilla Glass read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot