డ్యుయల్ ఫ్రంట్ స్పీకర్‌తో మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 3
బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన కాన్వాస్ శ్రేణి నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. డ్యుయల్ ఫ్రంట్ స్పీకర్ ప్రత్యేకతతో వస్తోన్న ఈ ఫోన్ మోడల్ ‘మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 3'. ఆన్‌లైన్ మార్కెట్ ధర రూ.6,499.
(చదవండి: 10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015))

మెటాలిక్ ఫినిష్‌తో లభ్యమవుతోన్న కాన్వాస్ ఫైర్ 3 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.
(చదవండి: ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?)

8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్పల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, జీపీఆర్ఎస్, వై-పై, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్, డ్యుయల్ సిమ్), 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








