మైక్రోసాఫ్ట్ చవక ధర విండోస్ స్మార్ట్‌ఫోన్, లుమియా 430
‘లుమియా 430' పేరుతో చవక ధర విండోస్ స్మార్ట్ ఫోన్ ను మైక్రోసాఫ్ట్ గురువారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో విండోస్ 10 సాఫ్ట్ వేర్ అప్ డేట్ ను అందుకోనున్న ఈ ఫోన్ ధర రూ.5,599. (ఇంకా చదవండి: ఫోన్ బ్యాటరీ ఉబ్బిందా..?)

ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ రెండు 3జీ సిమ్ స్లాట్‌లను కలిగి ఉంటుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 4 అంగుళాల WVGA స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 480×800పిక్సల్స్), విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టి విత్ లెనిమ్ అప్‌డేట్‌తో (త్వరలోనే ఈ ఓఎస్‌ను విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసే అవకాశం) 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

డ్యుయల్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీబి వన్‌డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.


Click it and Unblock the Notifications