Home
Mobile

మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ లుమియా కొత్త ఫోన్‌లు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన లుమియా సిరీస్ నుంచి 640, 640 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. లుమియా 640 ఫోన్ ప్రముఖ రిటలైర్ Flipkart వద్ద ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది. మరో ఫోన్ లుమియా 640ఎక్స్ఎల్‌ను దేశ వ్యాప్తంగా అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంచారు. విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టంతో లభ్యమవుతోన్న ఈ రెండు ఫోన్‌లకు త్వరలోనే విండోస్ 10 అప్‌గ్రేడ్ అందనుంది.

మైక్రోసాఫ్ట్ లుమియా 640

మైక్రోసాఫ్ట్ లుమియా 640 కీలక స్పెసిఫికేన్‌లు:

5 అంగుళాల హైడెఫనిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ కొనుగోలు పై 30జీబి వన్‌డ్రైవ్ స్టోరేజ్‌ను ఉచితంగా పొందొచ్చు. 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/2.2అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్) 0.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/2.4అపెర్చుర్, 720 పికల్ వీడియో రికార్డింగ్), కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్ ఎల్టీఈ సపోర్ట్, ఎన్ఎఫ్ సీ), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.11,999.లుమియా 640 స్మార్ట్ ఫోన్ లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

మైక్రోసాఫ్ట్ లుమియా 640

లుమియా 640 ఎక్స్ఎల్ కీలక స్పెసిఫికేషన్‌లు:

5.7 అంగుళాల హైడెఫినిషన్ క్లియర్ బ్లాక్ స్ర్కీన్, ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, 259 పీపీఐ), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (కార్ల్ జిస్ ఆప్టిక్స్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, డీఎల్ఎన్ఏ, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.15,799. అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

ఇవికూడా చదవండి: ఆఫ్‌లైన్ గూగుల్ మ్యాప్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఏలా..?

Best Mobiles in India

English summary
Microsoft Lumia 640, 640 XL Launched in India Today: All You Need to Know. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X