రూ.499కే మోటో సీ ప్లస్ ఫోన్, ఎలాగో తెలుసా..?

Written By:

ప్రముఖ ఫోన్ దిగ్గజం లెనోవో ఈ మధ్య మోటో సీ ప్లస్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సరికొత్త ఫోన్ 2 జిబి ర్యామ్ తో అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా సేల్ అవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.6,999 మాత్రమే. అయితే దీన్ని రూ. 499కే మీరు సొంతం చేసుకోవచ్చు.

BSNL మరో సంచలన ఆఫర్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యంత తక్కువగా 499రూపాయలకే

మోటో సీ ప్లస్‌ పేరుతో ఈ నెల మొదట్లో విడుదలైన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత తక్కువగా 499రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌ విక్రయిస్తోంది.

6,500 రూపాయల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌

అది ఎలా అనుకుంటున్నారా? ఎక్స్చేంజ్‌ ఆఫర్‌లో. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6,500 రూపాయల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్‌ లిస్టు చేసింది.

మూడు కలర్‌ వేరియంట్లు

ఫైన్‌ గోల్డ్‌, పెర్ల్ వైట్, స్టార్రి బ్లాక్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను మరే ఇతర స్మార్ట్‌ఫోన్‌ ద్వారానైనా ఎక్స్చేంజ్‌ చేసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌ బట్టి ఈ ఆఫర్‌ అందిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

అదనంగా 5 శాతం కూడా తగ్గింపు

దీంతో పాటు యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డుదారులకైతే, అదనంగా 5 శాతం కూడా తగ్గింపును ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

జియో కస్టమర్లకు అదనంగా 30జీబీ 4జీ డేటా

అంతేకాక రిలయన్స్‌ జియోతో కూడా భాగస్వామ్యంతో ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు అదనంగా 30జీబీ 4జీ డేటా కూడా అందుబాటులోకి రానుంది.

పాత ఫోన్‌ పికప్‌ చార్జీ కింద 100 రూపాయలను

అయితే పాత ఫోన్‌ పికప్‌ చార్జీ కింద 100 రూపాయలను ఫ్లిప్‌కార్ట్‌ వేయనుంది. దీంతో కొనుగోలుదారులు మొత్తంగా ఈ ఫోన్‌ కొనుగోలు చేసేటప్పుడు 599 రూపాయలు కట్టాల్సి ఉంటుంది.

మోటో సీ ప్లస్‌ ఫీచర్లు

5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 720 x 1280 పిక్స‌ల్స్‌ రిజ‌ల్యూష‌న్‌, ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్
2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 128 జీబీ వరకు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto C Plus Now Available for as Low as Rs. 499 With Flipkart Exchange Offer read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot