Home
Mobile

మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్‌పై రూ.4,810 భారీ డిస్కౌంట్.. 144Hz డిస్‌ప్లే, 50MP OIS కెమెరా, 68W ఛార్జింగ్‌ దీని సొంతం

Moto Edge 50 Fusion: మంచి మిడ్-రేంజ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. మోటరోలా నుంచి వచ్చిన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్, ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఇప్పుడు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అదిరిపోయే డిజైన్, కళ్లకు ఇంపుగా ఉండే స్మూత్ డిస్‌ప్లే, రోజువారీ పనులకు అవసరమైన నమ్మకమైన పనితీరుతో వచ్చే ఈ ఫోన్, ఇప్పుడు గతంలో కంటే చాలా తక్కువ ధరకే మీ సొంతం కానుంది.

ప్రస్తుతం దీని ధర ఎంత? ఆఫర్లు ఏంటి? దీన్ని ఎందుకు కొనాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం పదండి. ప్రస్తుతం అమెజాన్‌లో, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్) ధర రూ.3,000 పైగా తగ్గింపు తర్వాత రూ.19,690గా చూపిస్తోంది.

Moto Edge 50 Fusion Sees Massive Rs 4810 Discount on Amazon 144Hz OLED  68W Charging Phone Steal Deal

* బ్యాంక్ ఆఫర్లు:

ఇది మాత్రమే కాదు, మీరు అమెజాన్ పే ICICI, DBS, లేదా వన్‌కార్డు క్రెడిట్ కార్డులు వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను వాడితే, అదనంగా మరో రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, అన్ని ఆఫర్లూ కలిపి ఈ ఫోన్‌ను మీరు కేవలం రూ.18,200లోపే కొనేయొచ్చు.

అంతేకాకుండా, అమెజాన్ నెలకి కేవలం రూ.955 నుంచి మొదలయ్యే EMI పద్ధతిని అందిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డులపై వడ్డీ లేని EMI (నో-కాస్ట్ EMI) సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దాన్ని ఎక్స్ఛేంజ్ చేసి, గరిష్టంగా రూ.18,250 వరకు అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు.

* అదనపు సౌకర్యాలు రక్షణ ప్లాన్లు:

మీ కొత్త ఫోన్‌కు మరింత భద్రత కావాలనుకుంటే, కేవలం రూ.849 చెల్లించి మొబైల్ వారంటీ ప్లాన్‌ను లేదా రూ.1,109 తో స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ఇవి మీ ఫోన్‌కు అనుకోని రిపేర్లు వచ్చినప్పుడు మీకు అదనపు భరోసా ఇస్తాయి. తద్వారా చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

* మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ ఫీచర్లు..

- డిస్‌ప్లే

ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD+ OLED ఎండ్‌లెస్ ఎడ్జ్ డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. HDR10+ సపోర్ట్, 1,600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ కూడా ఉన్నాయి. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ ఉండటం వల్ల చిన్నపాటి గీతలు, దెబ్బల నుంచి తట్టుకుంటుంది.

* ప్రాసెసర్, పనితీరు

దీనిలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్, అడ్రెనో 710 GPU ఉన్నాయి. రోజువారీ యాప్స్ వాడటానికి, సాధారణ గేమింగ్‌కు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫోన్ 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆధారిత మోటరోలా హలో UIతో నడుస్తుంది.

* కెమెరా

వెనుకవైపు రెండు కెమెరాలున్నాయి. ప్రధాన కెమెరా 50MP సోనీ LYT-700C సెన్సార్‌తో వస్తుంది, దీనికి OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కూడా ఉంది. అంటే, ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు చేయి కదిలినా షేక్ అవ్వకుండా వస్తాయి. రెండవది 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం ముందువైపు 32MP కెమెరా ఇచ్చారు.

* బ్యాటరీ

ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. దీనికి 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీన్ని కొనుగోలు చేయాలా వద్దా అనే నిర్ణయానికి వచ్చే ముందు కొన్ని ప్లస్ పాయింట్స్ చూద్దాం. ఈ మొబైల్ చాలా స్టైలిష్‌గా, చేతిలో తేలికగా అనిపించే డిజైన్‌తో వస్తుంది. 144Hz డిస్‌ప్లే దీని సొంతం. చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

* మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కొనొచ్చా..?

ఈ ధరలో మార్కెట్లో ఇతర ఫోన్ల నుంచి పోటీ ఉంది. కొన్నిసార్లు సెల్ఫీ కెమెరాలో చిన్న చిన్న సాఫ్ట్‌వేర్ సమస్యలు (బగ్స్) కనిపించవచ్చు. మరి, ఈ ఫోన్ కొనొచ్చా? అంటే, మీరు ఒక మంచి స్టైలిష్ లుక్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, అలాగే స్మూత్ డిస్‌ప్లే, రోజువారీ పనులకు సరిపడా పనితీరు, సింపుల్ సాఫ్ట్‌వేర్ అనుభవం కావాలనుకుంటే, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కచ్చితంగా ఒక అద్భుతమైన ఎంపిక.

More from GizBot

Best Mobiles in India

English summary
Grab the Motorola Edge 50 Fusion at a huge Rs 4,810 discount on Amazon! Get this sleek 144Hz display, 50MP camera phone for under Rs 18,200.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X