మోటో జీ3 స్మార్ట్‌ఫోన్‌.. నచ్చేవేంటి, నచ్చనివేంటి

Posted By:

భారీ అంచనాల మధ్య తన మూడవ వర్షన్ ‘మోటో జీ' స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 1జీబి ర్యామ్‌తో వచ్చే 8జీబి వేరియంట్ ధర రూ.11,99. 2జీబి ర్యామ్‌తో వచ్చే 16జీబి వేరియంట్ ధర రూ.12,999. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు మోటో అసిసస్ట్, మోటో యాక్షన్, మోటో డిస్ ప్లే వంటి సరికొత్త సాఫ్ట్ వేర్ లతో వచ్చిన ఈ ఫోన్ ఐపీఎక్స్7 రేటింగ్ తో పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలిగింది.

Read More: భారత్‌లో బూతు సైట్ల పై బ్యాన్

ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ 410 (ఎంఎస్ఎమ్ 8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఆర్ ఫిల్టర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్‌లో నచ్చిన అంశాలతో పాటు నిరుత్సహ పరిచిన అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఫీచర్: పెద్దదైన డిస్‌ప్లే

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ 1280x720పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ డిస్ ప్లేకు మరింత రక్షణ కవచంలా నిలుస్తుంది.

 

బెస్ట్ ఫీచర్: 2జీబి ర్యామ్

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వాటిలో మొదటిది 1జీబి ర్యామ్‌తో వచ్చే 8జీబి వేరియంట్ కాగా, రెండవది 2జీబి ర్యామ్‌తో వచ్చే 16జీబి వేరియంట్.

 

బెస్ట్ ఫీచర్: వాటర్ రెసిస్టెన్స్

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ ఐపీఎక్స్7 రేటింగ్‌తో పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలిగింది. ఈ ఫోన్ మూడు అడుగుల నీటిలో 30 నిమిషాలు ఉండగలదు.

 

బెస్ట్ ఫీచర్: కెమెరా

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ పటిష్టమైన కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఆర్ ఫిల్టర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

బెస్ట్ ఫీచర్: 4జీ కనెక్టువిటీ

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన రెండు సిమ్ స్లాట్స్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తాయి.

 

నచ్చని ఫీచర్: పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే కాదు

5 అంగుళాల హైడెఫినిషన్ లభ్యమవుతున్న మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ కేవలం 267 పీపీఐను కలిగి ఉంది. ఫోన్ పీపీఐ తక్కువ సాంద్రతను కలిగి ఉండటం వల్ల వీడియోలతో పాటు గేమ్స్ ను అత్యుత్త క్వాలిటీతో ఆస్వాదించలేం.

 

నచ్చని ఫీచర్: ఫోన్ డిజైనింగ్

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ చేతిలో సౌకర్యంతంగా ఇమిడినప్పటికి బల్కీగా అనిపిస్తుంది. 11.6 మిల్లీమందంతో 155 గ్రాముల బరువును కలిగి ఉండే మోటో జీ3 మార్కెట్లోని ఇతర మోడళ్ల స్మార్ట్ ఫోన్ లతో పోలిస్తే మందంగా ఉండటం కాస్తంత నిరుత్సాహపరిచే అంశమే.

 

నచ్చని ఫీచర్: ప్రాసెసర్

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ చాలా పాతదైన స్నాప్‌డ్రాగన్ 410 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇదే ధర పరిధిలో లభ్యమవుతున్న అనేక మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 615 అంతకన్నా హయ్యర్ వర్షన్ చిప్‌సెట్‌ల పై లభ్యమవుతున్నాయి.

 

నచ్చని ఫీచర్: బ్యాటరీ

మోటో జీ3 స్మార్ట్‌ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో లభ్యమవుతోంది. ఏ విధమైన బ్యాటరీ సేవింగ్ మోడ్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరచలేదు. 4జీ కనెక్టువిటీ, 5 అంగుళాల డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఎక్కువ బ్యాటరీ పవర్‌ను తీసుకుంటాయి. కాబట్టి, బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోయే అవకాశముంది.

 

నచ్చనివి : కొన్ని సెన్సార్స్ లోపించటం

టెంపరేచర్ సెన్సార్, బారో మీటర్, గ్రావిటీ సెన్సార్ వంటి అంశాలు మోటో జీ3 స్మార్ట్‌ఫోన్‌లో కూడా లోపించాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G (3rd Gen): 5 Best And 5 Worst Features Of The Smartphone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot