సంచలనం రేపుతున్న మోటో M, లాంచ్ డేట్ ఫిక్సయింది

Written By:

మోటోరోలా తన తరువాతి తరం ఫోన్ లాంచింగ్ కు వేదికతో పాటు ముహుర్తాన్ని కూడా ఖరారు చేసింది. మోటో ఫోన్లు లెనోవా నుంచి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మోటో ఎమ్ కూడా రిలీజ్ కు సిద్ధమైంది. చైనాలో ఈ ఫోన్ ను బుధవారం అధికారికంగా కంపెనీ లాంచ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ పై లీకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేసున్నాయి. పూర్తి ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో అంటే ఏమిటీ, అంబానికి ఆ పదం ఎందుకు నచ్చింది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవా పీ2 స్మార్ట్‌ఫోన్

లెనోవా తన తరువాతి తరం ఫోన్ లెనోవా పీ2 స్మార్ట్‌ఫోన్ ను కూడా ఇదే వేదికగా లాంచ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీని కన్నా మోటో ఎమ్ ఫోన్ పైనే టెక్ విశ్లేషకులు దృష్టి సారించారు. అది ఎటువంటి ఫీచర్లతో రాబోతోందని అంచనాల మీద అంచనాలు వేస్తున్నారు.

ధర

ధర విషయానికొస్తే మోటోరోలా నుంచి రానున్న ఈ ఫోన్ ధర CNY 1,999 ఇండియన్ కరెన్సీలో రూ. 20 వేలుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు స్టోరేజి వేరియంట్లలో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

సోర్స్ : playfuldroid

గోల్డ్ , సిల్వర్ వేరియంట్లలో

డిజైన్ విషయానికొస్తే లీకయిన సమాచారం ప్రకారం గోల్డ్ , సిల్వర్ వేరియంట్లలో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైబోలు ఫోన్లకు సంబంధించి కొన్ని ఇమేజ్ లు లీకయిన విషయం తెలిసిందే. దీంతో పాటు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొట్టమొదటి మెటల్ బాడీ డిజైన్ ఫోన్

మోటరోలా నుంచి విడుదలవుతోన్న మొట్టమొదటి మెటల్ బాడీ డిజైన్ ఫోన్ Moto M కావటం విశేషం. అలాగే Moto M ఫోన్‌లో మొట్టమొదటి సారిగా మీడియాటెక్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్, మాలి టి 860 గ్రాఫిక్స్ వినియోగించినట్లుగా తెలుస్తోంది.

వెనుక భాగంలో ఫింగర్ ప్రింగ్ స్కానర్

రూమర్ మిల్స్ చెబుతోన్న వివరాల ప్రకారం మోటో ఎమ్ ఫోన్‌లో ఫింగర్ ప్రింగ్ స్కానర్ వెనుక భాగంలో ఉంటుందట. ఇప్పటి వరకు అన్ని మోటో డివైస్ లలో ముందు భాగంలో మాత్రమే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను ఏర్పాటు చేయటం మనం చూసాం.

4జీబి ర్యామ్‌తో,32/64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్

లీకయిన వివరాల ప్రకారం మోటో ఎమ్ ఫోన్.. 4జీబి ర్యామ్‌తో,32/64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ తో రాబోతోంది.అంతే కాకుండా దీనికి ముందు భాగంలో ఎటువంటి హోమ్ బటన్ లేదని కూడా లీకయిన వివరాలు తెలియజేస్తున్నాయి.

16 మెగాపిక్సల్ రియర్ కెమెరా

కెమెరా విషయానికొస్తే 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ ను పొందుపరిచారు. అలాగే సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ముందు భాగంలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది.

అదనపు ఆకర్షణ

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్, ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ వీవోఎల్టీఈ , బ్లూటూత్ 4.1 ఎల్ఈ, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ లాంటివి ఫోన్ కు అదనపు ఆకర్షణగా నిలువనున్నాయి.

మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన యాప్స్

వీటితో పాటు మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన యాప్స్ Skype, Office, and OneDriveలు ఫ్రీ లోడెడ్ గా లభించనున్నాయి. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే నాన్ కోటింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto M Expected to Launch on Tuesday: Price, Specifications, and Other Rumours Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot