మోటో సంచలనం, అతి చిన్న బ్యాటరీతో Moto Z2 Play

Written By:

లెనోవా నుంచి వచ్చిన మోటో ఫోన్లంటే చాలామందికి చెప్పలేని క్రేజ్. ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రతీ ఫోన్ హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. రీ సెంట్ గా వచ్చిన మోటో జడ్ ప్లే భారీ స్థాయిలోనే అమ్మకాలను కొల్లగొట్టింది. ఇప్పుడు అదే కంపెనీ నుంచి మరో ఫోన్ దూసుకొస్తోంది. Moto Z2 Play పేరుతో వస్తున్న ఈ ఫోన్ థిన్నర్ గానూ. అత్యంత చిన్న బ్యాటరీతోనూ రానుంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి మరి.

ఐఫోన్ 8 ఆశలు ఆవిరి ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3,000mAh battery

మోటో నుంచి త్వరలో దూసుకురానున్న Moto Z2 Play 3,000mAh batteryతో రానుంది. దాదాపు 1 రోజు 6 గంటలు బ్యాకప్ తో రానుంది. అయితే Moto Z Play 3,510mAh batteryతో దాదాపు రెండు రోజులు సింగిల్ ఛార్జ్ వస్తుంది. రెండికి తేడా ఏంటంటే Moto Z2 Play ధిక్ నెస్ తో పాటు కొంచెం బరువు కూడా తగ్గనుంది.

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు Snapdragon 626 processor clocked at 2.0Ghzతో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 4 జీబీ ర్యామ్ తో Moto Z2 Play వస్తోంది. 64 జీబీ స్టోరేజ్ ఉంటుంది.

కెమెరా

12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో నచ్చిన విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ అభిమానుల కోసం 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

అదనపు ఆకర్షణలు

వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ , బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ ఫోన్ కి అదనపు ఆకర్షణలు

టర్బో చార్జింగ్

3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ దీని సొంతం. Lunar Gray and Fine Gold కలర్స్ లో ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ తో పాటు Moto Z2, Moto Z2 Force, Moto E4 and E4 Plus, Moto C and C Plus, and a tablet device లను కూడా వచ్చే నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto Z2 Play will be thinner, to feature smaller battery: Report read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot