మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్’

Written By:

కింద పడినా పగలని సామర్థ్యాలతో మోటరోలా అభివృద్థి చేసిన శక్తివంతమైన ఫోన్ 'మోటో ఎక్స్ ఫోర్స్'(Moto X Force) త్వరలో భారత్‌కు రాబోతోంది. మోటరోలా ఇండియా ఈ ఫోన్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. క్రిందపడినా ధ్వంసం కాని shatterproof డిస్‌ప్లే, వాటర్-రిపెల్లెంట్ నానో - కోటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ దృఢమైన ఫోన్‌లో మోటరోలా పొందుపరిచింది. ఈ ఫోన్‌లోని పలు ముఖ్యమైన ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Asus నుంచి శక్తివంతమైన ఫోన్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

shatterproof డిస్‌ప్లే

మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

shatterproof డిస్‌ప్లేతో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా మోటో ఎక్స్ ఫోర్స్ చరిత్ర పుటల్లో నిలవనుంది.

శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్

మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్810 సాక్‌తో రానుంది. ఫోన్‌లో పొందుపరిచిన 600 మెగాహెర్ట్జ్ సామర్థ్యంతో అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ హై క్వాలిటీ గేమింగ్‌ను అందిస్తుంది.

 

21 మెగా పిక్సల్ కెమెరా

మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 21 మెగా పిక్సల్ కెమెరాతో రానుంది. 1/2.4" సోనీ ఐఎమ్ఎక్స్ సెన్సార్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ వంటి ఆధునిక ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

 

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది.

 

32జీబి ఇంటర్నల్ మెమరీ

మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. 64జీబి మోడల్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని మోటరోలా కల్పించనుంది.

 

బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే

మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన 3,760ఎమ్ఏహెచ్ బ్యాటరీ సుధీర్ఘమైన 48 గంటల బ్యాకప్ ను అందించగలదని కంపెనీ చెబుతోంది.

 

క్విక్ చార్జింగ్ టెక్నాలజీ

మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన క్విక్ చార్జింగ్ టెక్నాలజీ‌లో భాగంగా ఫోన్‌ను 15 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు 13 గంటలకు సరిపడా ఛార్జింగ్ ఫోన్‌కు సమకూరుతుంది.

 

వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్

మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

 

వాటర్-రిపెల్లెంట్ కోటింగ్

మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ వాటర్-రిపెల్లెంట్ కోటింగ్‌తో వస్తోంది. ఈ ఫోన్ నీటిలో పడినప్పటికి చెక్కుచెదరదు.

 

కలర్ వేరియంట్స్

మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్‌లోని 10 ఆసక్తికర

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్.. సాఫ్ట్ గ్రిప్ మెటీరియల్, బాలిస్టిక్ నైలాన్ ఇంకా లెదర్ రిమూవబుల్ బ్యాక్స్‌తో వస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Confirms Moto X Force Launch In India: Top 10 Features Of The Smartphone.Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting