Home
Mobile

5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.7 అంగుళాల కర్వడ్‌ డిస్‌ప్లే 5G ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్‌..!

మోటోరోలా ఎడ్జ్‌ 60 నుంచి ఇటీవల ఫ్యూజన్‌, స్టైలస్‌, ప్రో మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. మోటోరోలా ఎడ్జ్‌ 60 స్మార్ట్‌ఫోన్‌ జూన్‌ 10 వ తేదీన భారత్‌లో విడుదల కానుంది. అయితే గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ఇప్పటికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఒకటిగా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీ. 50MP కెమెరాను కలిగి ఉంది.

రూ.4 వేల డిస్కౌంట్‌ :
భారత్‌ మార్కెట్‌ లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 50 Fusion) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.4 వేల డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Motorola Edge 50 Fusion

అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.24,999 ధరకు విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,999 ధరకు అందుబాటులో ఉంది. అంటే రూ.4 వేలు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ ఫారెస్ట్‌ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్‌, హాట్ పింక్‌, మార్స్‌మల్లో బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. దీంతోపాటు Adreno 710 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

5000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ మోటోరోలా ఫోన్ టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

డిస్‌ప్లే పరంగా ఈ ఫోన్ 6.7 అంగుళాల FHD+ pOLED 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 30fps

ఈ హ్యాండ్‌సెట్‌ 5G, 4G VoLTE, బ్లూటూత్‌ 5.2, Wi-Fi 802, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మరియు IP68 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ ఫ్రూఫ్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మోటో కనెక్ట్‌, ఫ్యామిలీ స్పేస్‌ వంటి అదనపు ఫీచర్‌లతో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Motorola Edge 50 Fusion smartphone gets rs4000 discount on flipkart 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X