Home
Mobile

స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, 1.5K డిస్‌ప్లేతో మోటోరోలా ఫోన్‌!

Motorola Edge 70 Fusion Smartphone : మోటోరోలా నుంచి భారత్‌ మార్కెట్లో త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఈ సంవత్సరం జనవరిలో సిగ్నేచర్‌ వేరియంట్‌ అందుబాటులోకి వచ్చింది. సన్నని డిజైన్‌ని కలిగి ఉంది. దీంతోపాటు మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. అయితే త్వరలో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ విడుదల కానుందని తెలుస్తోంది.

ఎప్పుడు విడుదల కానుంది :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ మార్చి రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని కొన్ని లీక్స్‌ ద్వారా తెలుస్తోంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ ముఖ్యమైన స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ పాంటోన్‌ కంట్రీ ఎయిర్‌, పాంటోన్‌ బ్లూ సర్ఫ్, పాంటోన్‌ సిల్హౌట్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Motorola edge 70 Fusion smartphone

1.5k కర్వడ్‌ డిస్‌ప్లే :
మోటోరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K క్వాడ్‌ కర్వడ్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 5200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు SGS ఐ ప్రొటెక్షన్‌, స్మార్ట్ వాటర్‌ టచ్ 3.0 ఫీచర్‌లు ఉంటాయి.

స్నాప్‌డ్రాగన్ చిప్‌, 5 సంవత్సరాల అప్‌డేట్స్ :
మోటోరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వరకు సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

Motorola edge 70 Fusion smartphone

ఈ ఫోన్ మోటో ఏఐ, జెమిని, సర్కిల్‌ టు సెర్చ్‌ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది.

50MP సోనీ కెమెరా :
మోటోరోలా వెబ్‌సైట్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ మోటో AI ఇంటిగ్రేషన్‌ తో కూడిన 50MP సోనీ LYT 710 కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ కూడా ఉంటుంది. ఈ కెమెరానే మ్యాక్రో, డెప్త్‌ సెన్సర్‌గా పనిచేస్తుందని తెలుస్తోంది.

7000mAh బ్యాటరీ :
సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 32MP కెమెరాతో లాంచ్‌ కానుంది. ఈ కెమెరాలను 4K వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తాయి. ఈ మోటోరోలా ఫోన్‌ 68W వైర్‌ టర్బో పవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh సిలికాన్‌ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్‌ 70 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లో రూ.25 వేల ప్రారంభ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్‌ మోటో ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఈ ఫోన్‌ విడుదల తేదీ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola edge 70 Fusion smartphone key specifications revealed ahead of launch in india soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X