రూ.8999 ధరకే 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఫుల్ HD+ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్..!
పండుగ సీజన్ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈ నెల 23 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్ సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన అనేక డీల్స్ వివరాలు వెల్లడవుతున్నాయి. ఈ రెండు సేల్స్‌లోనూ ప్రైమ్, బ్లాక్, ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది.
అయితే సేల్ కంటే ముందుగానే కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ధరకు డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి వస్తున్నాయి. రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ సేల్ కంటే ముందుగానే రూ.5000 డిస్కౌంట్ తో అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా మరో స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది.

మోటోరోలా G35 5G స్మార్ట్‌ఫోన్ :
ఫ్లిప్‌కార్ట్ సేల్ కంటే మోటోరోలా G35 5G స్మార్ట్‌ఫోన్ (Motorola G35 5G Smartphone) డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ గత సంవత్సరం డిసెంబర్ లో అందుబాటులోకి వచ్చింది. విడుదల సమయంలో మోటో స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉండేది.
రూ.8999 ధరకే :
అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా G35 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.8999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ధరలో మంచి ఫోన్ గానే భావించవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 5 శాతం క్యా్ష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. మిడ్‌నైట్ బ్లాక్, లీఫ్ గ్రీన్, గువా రెడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
మోటోరోలా G35 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ మోడ్, నైట్ విజన్ బూస్టర్ ఫీచర్లను సపోర్టు చేస్తుంది. మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను పొందుతుంది.

5000mAh బ్యాటరీ, 50MP కెమెరా :
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ Unisoc T760 SoC ప్రాసెసెర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI తో పనిచేస్తోంది. 20W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ IP52 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను అమర్చి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో అందుబాటులో ఉంది. వైఫై, బ్లూటూత్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ, గైరోస్కోప్, SAR సెన్సార్, ఇ-కంపాస్ వంటి సెన్సర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications