‘మోటో జీ3’ లీకైంది..?
మోటరోలా నుంచి త్వరలో విడుదల కాబోతోన్న మోటో జీ (3వ జనరేషన్) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న వైట్ కలర్ వేరియంట్‌కు మోటో జీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
Read More: బెస్ట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ (ఇండియా)

మోటరోలా మోటో జీ (2015) మోడల్‌కు సంబంధించిన ఫోటోలను ప్రమోషన్ నిమిత్తం ప్రముఖ ఫ్రెంచ్ బ్లాగ్ నౌహియర్ఎల్స్.ఎఫ్ఆర్ ఇలా ఇంటర్నెట్‌లో విడుదల చేసినట్లు తెలుస్తోంది. 2014 మోడల్‌కు దగ్గర పోలికలను కలిగి ఉన్న ఈ కొత్త ఫోన్ వెనుక భాగం ఫ్రెష్ డిజైనింగ్‌తో పూర్తిగా కొత్త లుక్‌ను సంతరించుకున్నట్లు కనిపిస్తోంది. ఫోన్ వొంపు భాగాల్లో ఏర్పాటు చేసిన గ్లోసీఫ్రేమ్ ఫోన్ స్టైల్‌ను మరింత పెంచేసింది.

మోటో జీ (3వ జనరేషన్) స్పెసిఫికేషన్‌లు (అంచనా మాత్రమే)
64 బిట్ స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్-కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ఇంజిన్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
Read More: భారత్‌లో ఐటీ జాబ్స్.. ఈ కంపెనీల్లో బెస్ట్


Click it and Unblock the Notifications








