మోటోరోలా నుంచి ఫస్ట్ టైం మెటల్ బాడీ ఫోన్లు..

Written By:

మోటో తన తరువాతి తరం ఫోన్లను ఎమ్ సీరీస్ తో మార్కెట్లోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆ ఫోన్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు gfx benchలో లీకయ్యాయి. మోటో ఎమ్ అలాగే మోటో ఎమ్ ప్లస్ పేరుతో రానున్నఈ ఫోన్లు సరికొత్త ఫీచర్లతో రానున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు TENAAలో ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలు లీకయ్యాయి. ఈ ఫోన్లకు సంబంధించి లీకయిన ఫీచర్స్ ఏంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

mobiles, Tablets, Laptops

మీ మొబైల్ 4జీ సపోర్ట్ చేస్తుందా..చెక్ చేసుకోండిలా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెటల్ బాడీ

మీరు చూస్తున్న ఇమేజ్ మొత్తం ఫీచర్లకు సంబంధించనది. ఇది మొటల్ బాడీతో రానున్నట్లు తెలుస్తోంది. మోటోరోలా నుంచి మొటల్ బాడీతో రానున్న ఫస్ట్ ఫోన్ కూడా ఇదే.

పింగర్ ప్రింట్ స్కానర్

లీకయిన ఇమేజ్ ల ప్రకారం త్వరలో మార్కెట్లో కనువిందుచేయనున్న ఈ ఫోన్లు పూర్తి స్తాయి పింగర్ ప్రింట్ స్కానర్ తో రానున్నట్లుగా తెలుస్తోంది.

డిస్ ప్లే

మోటో ఎమ్ 4.6 ఇంచ్ డిస్ ప్లేతో వస్తుంటే మోటో ఎమ్ ప్లస్ మాత్రం 5.5 ఇంచ్ డిస్ ప్లేతో వస్తోంది. రెండూ 1080 రిజల్యూషన్ తో రానున్నాయి.

మీడియాటెక్ చిప్ సెట్

GFXBench రిపోర్ట్ ప్రకారం మోటో ఎమ్ MediaTek MT6750 chipsetతో రానుంది. 3 జిబి ర్యామ్ అలాగే 32 జిబి ఇంటర్నల్ మొమొరీతో ఫోన్లు దూసుకురానున్నాయి. యూజర్లకు 25 జిబి వరకు వాడుకునే వీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.మోటో ఎమ్ ప్లస్ కూడా అదే ఫీచర్లతో వస్తోంది.

కెమెరా

రానున్న ఈ ఫోన్లు 16 ఎంపీ మెగా ఫిక్సల్ తో రానున్నాయి. అలాగే 8 ఎంపీ సెల్ఫీ తో 4కె వీడియో రికార్డ్ చేయవచ్చు. దీంతో పాటు FHD videos కూడా రికార్డ్ చేయవచ్చు.

బ్యాటరీ

రానున్న ఈ ఫోన్లు బిగ్గర్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. Moto M Plus దాదాపు 3000 mAh బ్యాటరీతోనూ అలాగే Moto M 2700 mAh తోనూ రానున్నాయి.

ఆండ్రాయిడ్ 6.0

త్వరలో రానున్న ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లోతో రానున్నాయి. అలాగే గూగుల్ ప్లే ఎడిషన్ అనేది స్పెషల్ ఫీచర్ గా లాంచ్ చేస్తున్నట్లు సమాచారం.

ధర

ఈ ఆసియా మార్కెట్లలో ఎక్సక్లూజివ్ గా విక్రయించే అవకాశం ఉంది. చైనా ఇండియాలో మాత్రమే దొరికే అవకాశం ఉంది. ఈ ఫోన్లు దాదాపు 200 డాలర్లనుంచి 250 డాలర్ల మధ్యలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Motorola Moto M, M Plus Metal Bodied Smartphones Leak Via GFXBench: 8 Specs You Need to Know
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot