భారత్ మార్కెట్‌లోకి త్వరలో మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. శక్తివంతమైన AI ఫ్లిప్ ఫోన్‌గా...!
మోటోరోలా ఇండియా ఇటీవల ఎడ్జ్ 60 సిరీస్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ప్రో మోడల్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో మోటోరోలా రేజర్ 60 సిరీస్ లాంచ్ అయింది. ఇందులో Razr 60, Razr 60 అల్ట్రా మోడల్స్ గ్లోబల్ మార్కెట్‌లో విడుదల అయ్యాయి. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈ ఫోల్డబుల్ ఫోన్ భారత్‌లోనూ లాంచ్ కానుంది.
మోటోరోలా ఇండియా సోషల్ మీడియా హ్యాండిల్, ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లా్ట్‌ఫాం అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా మోటోరోలా Razr 60 అల్ట్రా త్వరలో (Motorola Razr 60 Ultra Smartphone) భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ శక్తివంతమైన AI ఫ్లిప్ ఫోన్‌గా ఉంటుందని చెబుతోంది. అయితే ఈ ఫోన్ భారత్‌లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.

మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ :
ఈ మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 165Hz రీఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల pOLED LTPO ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అదే విధంగా 4 అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది.
ఈ మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UX పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఎన్ని వేరియంట్స్‌లో లాంచ్ కానుందో తెలియాల్సి ఉంది. మరియు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పైనా క్లారిటీ రావాల్సి ఉంది.
When craftsmanship meets cutting-edge tech, every flip makes a statement.#Motorola #StayTuned
— Motorola India (@motorolaindia) May 5, 2025
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తుంది. ఈ కెమెరాలతో బెస్ట్ కెమెరా అనుభూతిని పొందవచ్చని తెలుస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ 68W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ IP48 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో గ్రీన్, రెడ్, బీజ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
అల్ట్రా మోడల్ గ్లోబల్ వేరియంట్ కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.4, Wi-Fi 6E, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు తో అందుబాటులోకి వచ్చింది. మరియు సెక్యూరిటీ కోసం ఈ హ్యాండ్‌సెట్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1.10 లక్షలుగా ఉంది. అయితే భారత్‌లో ఎంత ధరకు అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.
గ్లోబల్ మార్కెట్‌లో అల్ట్రా వేరియంట్‌తోపాటు బేస్ వేరియంట్ మోటోరోలా Razr 60 కూడా లాంచ్ చేశారు. అయితే భారత్‌లో ప్రస్తుతం అల్ట్రా వేరియంట్‌ను మాత్రమే లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బేస్ వేరియంట్‌పై ఎటువంటి ప్రకటన లేదు. అల్ట్రా వేరియంట్‌ను పవర్‌ఫుల్ AI ఫ్లిప్ ఫోన్‌గా పరిచయం చేసింది.


Click it and Unblock the Notifications