ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే.. వస్తే షాకేనట

Written By:

ఆపిల్ నుంచి సెప్టెంబర్ లో రీ డిజైన్ ఫోన్ వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు కదూ..అది సెప్టెంబర్ లో వస్తుందని అనేక రకాల వదంతులు కూడా వినిపిస్తున్నాయి. అది సెప్టెంబర్ లో రావడం లేదని దాని కోసం మరి కొంత కాలం వేచి చూడక తప్పదని ఆపిల్ కు చెందిన ఉద్యోగి తెలిపారు. మరి సెప్టెంబర్ లో రానున్న ఫోన్ ఎలా ఉండబోతోందంటే అది పాత ఫీచర్లతోనే మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. కొత్త ఫోన్ మాత్రం అదిరే ఫీచర్లతో మార్కెట్ లోకి దిగుతుందని తెలుస్తోంది. ఎప్పుడు వస్తుందో ఓ స్మార్ట్ లుక్కేయండి.

బంపరాఫర్..ల్యాపీ కొనాలనుకునే వారికి హెచ్‌పీ లోన్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే..వస్తే షాకేనట

2017 నాటికి ఐ ఫోన్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఆసందర్భంగా పెద్ద సెలబ్రేషన్ ఏర్పాటు చేసి ఆ పోగ్రాంలో కొత్త అప్ డేట్‌తో ఆపిల్ ఫోన్‌ను రిలీజ్ చేయబోతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే..వస్తే షాకేనట

ఇదిలా ఉంటే సెప్టెంబర్‌లో ఐ ఫోన్ 7 రానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అది ఐ ఫోన్ 7 కాదని ఆ రోజున రానున్న ఫోన్ చిన్న చిన్న మార్పులతోనే ఐ ఫోన్ 6 ఎస్‌ఈని మార్కెట్లోకి తీసుకొస్తారని ఓ జర్మన్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే..వస్తే షాకేనట

కంప్లీట్ రీడిజైన్ ప్రొడక్ట్‌ను ఆపిల్ తన 10 వ వార్షికోత్సవంలోనే ఆవిష్కరిస్తుందని దాని పేరు ఐఫోన్ 8 గా ఉంటుందని ఆపిల్ అనలిస్టు క్రియేటివ్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ టిమ్ బజరిన్ పేర్కొంటున్నారు.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే..వస్తే షాకేనట

ఈ బిగ్ రీడిజైన్ ఫోన్‌లో చాలా కొత్త ఫీచర్లుంటాయని, వైర్‌లెస్ చార్జింగ్, గ్లాస్ బాడీ అరౌండ్ మెటల్ ఫ్రేమ్, కెమెరా ఇంఫ్రూవ్‌మెంట్, ఎక్కువ మెమరీ, అమోలెడ్ 4 కే స్క్రీన్‌లు ఉండబోతున్నాయని చెబుతున్నారు.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే..వస్తే షాకేనట

2014 లో ఐఫోన్ 6‌తో ఆపిల్ లాస్ట్ అప్ గ్రేడ్ చేపట్టింది. ఐఫోన్లలో ఇదే బెస్ట్ సెల్లింగ్ ఐఫోన్ గా నిలిచింది. తర్వాత ఏడాదిన్నరకి అదేమాదిరి డిజైన్‌తో మరో ఐఫోన్ 6ఎస్‌ను లాంచ్ చేసింది. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, కొన్ని కొత్త ఫీచర్లను ఈ ఫోన్‌కు ఆపిల్ జోడించింది.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే..వస్తే షాకేనట

మరోవైపు ఆపిల్ బిగ్ రీ-డిజైన్ 2017 కు వాయిదా పడిందని చైనీస్ తయారీదారులు సూచిస్తున్నట్టు జర్మన్ ఆపిల్ న్యూస్ సైట్ పేర్కొంది. అదేవిధంగా ప్రొడక్ట్ అప్ గ్రేడ్ కాలం కూడా ఇక మూడేళ్లు కాబోతుందని నిక్కీ ఆసియన్ రివ్యూ రిపోర్టు పేర్కొంది.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే..వస్తే షాకేనట

సెప్టెంబర్ 16న ఐఫోన్ 6 ఎస్ఈ ప్రవేశపెడతారని, దాంతో పాటు కొత్త ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఐఓఎస్ 10 ను ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే..వస్తే షాకేనట

అయితే తర్వాత రాబోతున్న ఐఫోన్లన్నీ ఆపిల్ ఏ 10 ప్రాసెసర్, 2/4 జీ ర్యామ్ వేరియంట్లు, బిగ్గర్ బ్యాటరీస్‌లతో ఉంటాయట.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే.. వస్తే షాకేనట

అలాగే సెప్టెంబర్‌లో వచ్చే ఫోన్ రెండు వేరియంట్లలో కాకుండా మూడు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే.. వస్తే షాకేనట

అదిరిపోయే కెమెరాతో పాటు మెమొరీని కూడా అధికం చేసి ఈ ఫోన్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 32 జిబి స్టోరేజ్‌తో కొత్త ఫోన్లు రానున్నట్లు తెలుస్తోంది. మరి వాటికోసం 2017 వరకు ఆగాల్సిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write New redesigned iPhone? You may have to wait
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot